నగర పౌరుల సేవలో మేము సైతం
వృత్తులు వేరైనా వారి ప్రవృత్తి మాత్రం ప్రజా సమస్యలు, వాటిని పరిష్కరించే మార్గాలనే వారంతా ఏకైక లక్ష్యంగా చేసుకున్నారు.
- మొట్ట మొదటిసారిగా హైదరాబాద్ ట్వీట్ మీట్..
- సామాజిక సేవే లక్ష్యంగా కార్యాచరణ
- హాజరైన 40 మందికి పైగా సభ్యులు
సిటీబ్యూరో, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): వృత్తులు వేరైనా వారి ప్రవృత్తి మాత్రం ప్రజా సమస్యలు, వాటిని పరిష్కరించే మార్గాలనే వారంతా ఏకైక లక్ష్యంగా చేసుకున్నారు. ఒక్కొక్కరుగా సోషల్ మీడియాలో ప్రజా సమస్యలను పోస్టు చేసిన వారంతా ఇప్పుడు ఒక్కటై వాటిని సంబంధిత ప్రభుత్వ శాఖల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే వరకు ఉమ్మడిగా కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. నగరంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని ప్రశంసిస్తూనే, మరింత సమర్థవంతంగా ప్రభుత్వం ప్రజలకు ఏం చేయాలో తమ వైపు నుంచి చేప్పేందుకు ఒక వేదికను సిద్ధ్దం చేసుకున్నారు. వారే యాష్‌ట్యాగ్ హైడ్ట్వీట్ మీట్(#HydTweetMeet)ను ఆదివారం రాత్రి నిర్వహించారు.
40 మందికిపైగా సభ్యులంతా ఒక్క చోట చేరి మెరుగైన హైదరాబాద్ మహానగరం కోసం కలిసి పనిచేద్దామని పలు నిర్ణయాలు తీసుకున్నామని నిర్వాహకుల్లో ఒకరైన చరణ్ తెలిపారు. నగరంలో పౌరులు ఎదుర్కొనే సమస్యలనే తాము పరిశీలించి, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చూపే వరకు పనిచేయాలన్న ఆలోచనతో తాము మొట్ట మొదటిసారిగా ఐటీ కారిడార్‌లోని మైండ్ స్పేస్ సెజ్‌లోని కో కర్మ వర్కింగ్ స్పేస్‌లో సమావేశమై చర్చించామని తెలిపారు. నగర రోడ్లపై ట్రాఫిక్ అంశంలో చూస్తే రోడ్లపై వేసిన రంబుల్ స్ట్రిప్స్ వల్ల ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు గుర్తించాం. వీటిని శాస్త్రీయంగా వేయకపోవడంతోనే ఇవి నగర వాసులకు ఇబ్బందికరంగా మారాయి. చూడడానికి చిన్న సమస్యే అయినా,నిత్యం నగరంలో లక్షలాది మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇలా నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించడం వాటి పరిష్కారానికి మార్గాలను చూపుతూ ప్రభుత్వ శాఖలను సంప్రదించే కార్యాచరణను సిద్ధ్దం చేసుకున్నామని చరణ్ తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయాలని నిర్ణయం
– డాక్టర్ శాంత తౌటం,సీఐఈ, టీఎస్ఐసీ, ట్విట్టర్ మీట్ సభ్యురాలు
ట్విట్టర్ మీట్లో సభ్యులైన వారంతా కలిసి ప్రజల కోసం కొంత సమయాన్ని కేటాయిస్తున్నారు. ఉన్నత చదువులతో పాటు ఉద్యోగాల్లో స్థిరపడిన వారంతా తమకున్న కొంత సమయాన్ని ప్రజా సేవ కోసం వెచ్చించేందుకు ఒక్కటయ్యారు. మొట్ట మొదటిసారిగా జరిగిన హైదరాబాద్ ట్విట్టర్ మీట్లో రకరకాల అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ప్రభుత్వంతో కలిసి పనిచేయడం ద్వారా ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, సేవలను అందించేందుకు అవకాశం కలుగుతుందని సభ్యులంతా నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో సేవలు ప్రారంభించి, మునుముందు రాష్ట్రంలోని ఇతర నగరాల్లోని ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఉంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

