Hyderabad | లండన్ బీచ్‌లో హైదరాబాద్ విద్యార్థిని మృతి
Hyderabad | లండన్‌లోని ఓ బీచ్‌లో నగరానికి చెందిన విద్యార్థిని మృతి చెందింది. ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని లక్ష్మీనగర్ కాలనీకి చెందిన కె.శశిధర్ రెడ్డి, జ్యోతి దంపతుల ఏకకై కుమార్తె కె.సాయి తేజస్విని రెడ్డి ఆరు నెలల కిందట లండన్‌కు వెళ్లింది.
Hyderabad | సైదాబాద్, ఏప్రిల్ 19 : లండన్‌లోని ఓ బీచ్‌లో నగరానికి చెందిన విద్యార్థిని మృతి చెందింది. ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని లక్ష్మీనగర్ కాలనీకి చెందిన కె.శశిధర్ రెడ్డి, జ్యోతి దంపతుల ఏకకై కుమార్తె కె.సాయి తేజస్విని రెడ్డి ఆరు నెలల కిందట లండన్‌కు వెళ్లింది. యూకేలోని క్రాన్ఫీల్డ్ యూనివర్సిటీలో ఏరోనాటిక్స్, స్పెస్ మాస్టర్ డిగ్రీ ఇంజినీరింగ్ విద్యను అభ్యసించడానికి వెళ్లింది. అయితే ఈనెల 11వ తేదీన బ్రైటన్ బీచ్‌లో ఆమె నీటి అలల్లో చిక్కుకొని ప్రమాదవశాత్తు మరణించింది. దీంతో అక్కడి పోలీసులు విచారణ చేపట్టి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
మృతదేహాన్ని యూకేలోని ఓ ఆసుపత్రిలో భద్రపర్చారు. ఆమె మృతదేహాన్ని ఇండియాకు తీసుకుని రావడానికి సహకరించాలని కోరుతూ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ను కుటుంబసభ్యులు ట్విట్టర్ ద్వారా కోరడంతో స్పందించిన మంత్రి మీ నష్టానికి చాలా చింతిస్తున్నాం.. నా టీమ్ స్థానిక బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్‌ను కలిసి వెంటనే సహాయం చేస్తుందని రీట్వీట్ చేశారు. అదే విధంగా సాయి తేజస్విని సోదరి ప్రియా రెడ్డి చేసిన ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ సాయి తేజస్విని మృతదేహాన్ని ఇక్కడికి తీసుకురావడానికి కుటుంబం చాలా అధికార సవాళ్లను ఎదుర్కొంటుందని ట్వీట్ చేశారు.
శుక్రవారం ఇండియాకు మృతదేహం
కె.సాయి తేజస్విని రెడ్డి మృతదేహం శుక్రవారం ఢిల్లీకి చేరుకుంటుందని, అదే రోజు రాత్రి వరకు కుటుంబ సభ్యులకు అప్పగించే ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేస్తున్నారని బీజేపీ ఐఎస్ సదన్ డివిజన్‌కు చెందిన భాగ్యనగర్ జిల్లా అధికార ప్రతినిధి వీరేంద్ర బాబు తెలిపారు. శనివారం ఉదయం చంపాపేటలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారని ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్‌కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

