పచ్చదనంపై మళ్లీ వేటు!
గ్రేటర్ హైదరాబాద్‌కు ఊపిరితిత్తుల్లాంటి కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్) జాతీయ పారు చుట్టూ మళ్లీ అభివృద్ధి పేరిట పర్యావరణ విధ్వంసం సృష్టించిన అధికారులు ...ప్రాజెక్టు అలైన్మెంట్ మార్పు పేరిట మరో కారిడార్‌లో పచ్చదనంపై వేటు వేసేందుకు సిద్ధమయ్యారు. ముగ్ధ జంక్షన్ నుంచి పంజాగుట్ట ఎన్ఎఫ్సీఎల్ కారిడార్ వరకు చేపట్టనున్న స్టీల్ బ్రిడ్జి పనుల నేపథ్యంలో 4.3 కిలోమీటర్ల సెంట్రల్ మీడియన్‌లో దశాబ్దాలుగా కళకళలాడుతున్న పచ్చదనం.. పెద్ద ఎత్తున చెట్లు నేలకూలే ప్రమాదం ఏర్పడింది.
- కేబీఆర్ పారు చుట్టూ ఇప్పటికే వృక్షాల తొలగింపు
- అలైన్మెంట్ మార్పు పేరిట తాజాగా గ్రీనరీపై నజర్
- ముగ్ధ జంక్షన్ -పంజాగుట్ట సెంట్రల్ మీడియన్‌లో చెట్లు, మొక్కలు మటాష్
- ప్రాజెక్టు పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన కమిషనర్ కర్ణన్
గ్రేటర్ హైదరాబాద్‌కు ఊపిరితిత్తుల్లాంటి కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్) జాతీయ పారు చుట్టూ మళ్లీ అభివృద్ధి పేరిట పర్యావరణ విధ్వంసం సృష్టించిన అధికారులు …ప్రాజెక్టు అలైన్మెంట్ మార్పు పేరిట మరో కారిడార్‌లో పచ్చదనంపై వేటు వేసేందుకు సిద్ధమయ్యారు. ముగ్ధ జంక్షన్ నుంచి పంజాగుట్ట ఎన్ఎఫ్సీఎల్ కారిడార్ వరకు చేపట్టనున్న స్టీల్ బ్రిడ్జి పనుల నేపథ్యంలో 4.3 కిలోమీటర్ల సెంట్రల్ మీడియన్‌లో దశాబ్దాలుగా కళకళలాడుతున్న పచ్చదనం.. పెద్ద ఎత్తున చెట్లు నేలకూలే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే కేబీఆర్ పారు చుట్టూ చేపట్టిన హెచ్సిటీ పనుల వల్ల స్థానికంగా పర్యావరణం తీవ్రంగా నష్టపోయినట్లు పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో ఇప్పుడు కారిడార్ ప్యాకేజీ-2 స్టీల్ బ్రిడ్జి నిర్మాణం మరింత తీవ్రమైన నష్టాన్ని మిగల్చనుంది.

పర్యావరణ విధ్వంసానికి కేరాఫ్‌గా బల్దియా
హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా. దాదాపు రూ. 1,090 కోట్ల అంచనా వ్యయంతో ముగ్ధ జంక్షన్ మీదుగా ఎంజే కాలేజీ, ఎన్ఎఫ్సీఎల్ కారిడార్ వరకు 6 లైన్లతో స్టీల్ బ్రిడ్జిని 4.3 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ఈ అలైన్మెంట్ మార్పు వల్ల రోడ్డు మధ్యలో దశాబ్దాలుగా నగరానికి ఆక్సిజన్ అందిస్తున్న దట్టమైన చెట్లు, మొకలతో కూడిన సెంట్రల్ మీడియన్ పూర్తిగా తొలగించాల్సి వస్తోంది. ఇప్పటికే కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించగా..తాజాగా గురువారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ముగ్ధ జంక్షన్ నుంచి ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ వరకు ఉన్న మార్గంలో పునాది రూపకల్పనకు జియో టెక్నికల్ పరిశోధనలను తక్షణమే ప్రారంభించాలని కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ మధ్య ట్రాఫిక్ చికులను వదిలించి, సిగ్నల్ రహిత ప్రయాణాన్ని అందించేందుకే ఈ 6-లేన్ల స్టీల్ ఫ్లైఓవర్ నిర్మిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

