Hyderabad | న్యూఇయర్ వేళ హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం సృష్టిస్తున్నాయి. జూబ్లీహిల్స్, ఎల్బీనగర్లో డ్రగ్స్ తరలిస్తున్న ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. నూతన సంవత్సర వేడుకల్లో మత్తు పదార్థాలను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్‌లో కొకైన్ తరలిస్తున్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 100 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.
ఎల్బీనగర్లో డ్రగ్స్ తరలిస్తున్న ముగ్గురిని ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 15 గ్రాముల హెరాయిన్, 10 వేల నగదు, ఒక బైక్, మూడు మొబైల్ ఫోన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ నుంచి ఈ డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు గుర్తించారు.