నిరుద్యోగ యువత కోసమే ఉద్యోగ మేళాలు

- హాజరైన 4 వేల మంది నిరుద్యోగులు
- పాల్గొన్న 35 కంపెనీలు
- అక్కడికక్కడే ఇంటర్వ్యూలు..నియామకపత్రాలు
ఉస్మానియా యూనివర్సిటీ : ఉమ్మడి రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు, పోలీసులు అంటే భయపడే ప్రజలు.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో పోలీసులు ప్రజలకు దగ్గరయ్యారు. అంతేకాకుండా కమ్యూనిటీ పోలీసింగ్ పేరుతో సమాజంలో పాతుకుపోయిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు నగర వ్యాప్తంగా ఉద్యోగ మేళాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందు లో భాగంగా ఉద్యోగ మేళాను ఉస్మానియా యూనివర్సిటీ పీజీఆర్ఆర్సీడీఈ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ మేళాకు దాదాపు నాలుగువేల మంది నిరుద్యోగ యువతీయువకులు హాజరయ్యారు. వారికి ఉద్యో గ అవకాశాలు కల్పించేందుకు దాదాపు 35 కంపెనీలు ముందుకు వచ్చాయి. ఈ మేళాను ముఖ్య అతిథిగా హాజరైన నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. వెయ్యి మైళ్లు అయినా.. ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుందన్నారు. ప్రతీ ఉద్యోగానికి ఏదో ఒక ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. అవకాశం ఒక్కసారి మాత్రమే తలుపుతడుతుందని.. వచ్చిన ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని ఉద్యోగంలో చేరి, తమ ప్రస్థానాన్ని కొనసాగించాలన్నా రు. శాంతిభద్రతల విషయంలో హైదరాబాద్ నగరం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని చెప్పారు. ప్రపంచంలోని సురక్షిత నగరాల జాబితాలో మొదటి 15 స్థానాల్లో మన నగరం కూడా ఉందని పేర్కొన్నారు. సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను అమలు చేస్తున్నామన్నారు. నగరంలోని ప్రతీ పోలీస్ స్టేషన్లో రోజూ కనీసం 50-70 మంది పౌ రులతో పోలీసులు మాట్లాడుతున్నారని చెప్పారు. దేశం లో పౌరుల ఇండ్లకు వెళ్లి మరీ ఫిర్యాదులు స్వీకరించే ఏకైక నగరం హైదరాబాద్ అని అన్నారు. కొన్ని తరాలు కష్టపడితే ఇప్పుడు అగ్రదేశాలకు ఏ మాత్రం తీసిపోకుండా మన దేశం రూపొందిందన్నారు. ఈ క్రమంలో ఉద్యోగ అవకాశాలు కూడా విస్తృతమయ్యాయని, సామర్థ్యం, అర్హత, నైపుణ్యం ఉంటే విజయం తప్పక సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. టీమ్ వర్క్‌తో జాతి పురోగతి సాధిస్తుందన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కరువు ముప్పుపై సర్కారు నిర్లక్ష్యం : చాడ కిషన్‌రెడ్డి
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

