Hyderabad Rains | హైదరాబాద్ నగరానికి హైఅలర్ట్.. ఇవాళ రాత్రి గంటకు 5 సెం.మీ. వర్షం కురిసే ఛాన్స్!
Hyderabad Rains | వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గత మూడు రోజులుగా గ్రేటర్ హైదరాబాద్ వర్షంలో తడిసి ముద్దవుతున్నది
Hyderabad Rains | వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గత మూడు రోజులుగా గ్రేటర్ హైదరాబాద్ వర్షంలో తడిసి ముద్దవుతున్నది. గురువారం కూడా భారీ వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ కె.నాగరత్న హైఅలర్ట్ ప్రకటించారు. ఇవాళ రాత్రి గంటకు 5 సెం.మీ. నుంచి 6 సెం.మీ. వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు.
నగరంలో ఎడతెరిపిలేకుండా వర్షం
హైదరాబాద్ (Hyderabad) నగరంలో రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా వర్షం (Rain) కురుస్తున్నది. బుధవారం సాయంత్రం ప్రారంభమైన వాన తెల్లవార్లు ఏకధాటిగా కురుస్తూనే ఉన్నది. మారేడుపల్లి, బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, జవహర్ నగర్, బొల్లారం, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, సీతాఫల్మండి, కుత్బుల్లాపూర్, నాగోల్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, దిల్సుఖ్నగర్, మలక్‌పేట, చాదర్‌ఘాట్, కోఠీ, నాంపల్లి, లక్డీకాపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎర్రగడ్డ, కూకట్పల్లి, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహదీపట్టం, చాంద్రాయణగుట్ట, సాగర్ రింగ్‌రోడ్డు, బీఎన్‌రెడ్డిలో భారీ వర్షం కురుస్తున్నది.
వర్షాల ధాటికి నాగోల్‌లోని అయ్యప్ప కాలనీలో ఇండ్లలోకి వరద నీరుచేరింది. లింగపల్లి రైల్వే అండర్‌పాస్ వద్ద భారీగా వరద నీరు చేరింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. గచ్చిబౌలి-లింగంపల్లి మార్గాల్లో వెళ్లాల్సిన వాహనాలను ట్రాఫిక్పోలీసులు దారిమళ్లిస్తున్నారు. కాగా, మరో పది నిమిషాల్లో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భార్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే భారీ వర్షాలతో జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. రోడ్లపై నీరు నిలువకుండా వచ్చిననీటిని వచ్చినట్లే పోయేట్లు చూస్తున్నారు. డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు, మున్సిపల్ అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. బీఆర్కే భవన్ వద్ద రోడ్డుపై చెట్టు కూలిపోయింది. దీంతో రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి.
హైదరాబాద్‌లో వర్షం పరిస్థితులపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రస్తుత పరిస్థితులు, అందుతున్న సహాయక చర్యలపై మేయర్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్‌లతో కలిసి సమీక్షించనున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurukul Schools | తప్పుసర్కార్ది .. శిక్ష సిబ్బందికి.. ఇదీ సాంఘిక సంక్షేమ గురుకులంలో దుస్థితి!
Cyber Crime | తెలంగాణలో సైబర్ నేరగాళ్ల విధ్వంసం.. గంటకు రూ.17 లక్షలు స్వాహా!
KTR Bus Yatra | 11 నుంచి 14 మధ్య కేటీఆర్ బస్సు యాత్ర.. 29న దీక్షా దివస్.. 50 వేల మందితో భారీ సభ
Gen Z Protests | జర్మనీలో జెన్‌జీ ఆగ్రహజ్వాలలు.. 34 నగరాల్లో నిరసనలు.. ఫ్రాంక్‌ఫర్ట్‌లో లూటీలు!
Gratuity Calculator | ఉద్యోగం మానేస్తున్నారా? మీకు రావాల్సిన గ్రాట్యుటీ ఎంతో ఇలా లెక్కించండి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

