హల్దీ ఫంక్షన్లో గుండెపోటుతో కుప్పకూలిన అతిథి
Hyderabad | ఉత్సాహంగా కొనసాగుతున్న హల్దీ ఫంక్షన్లో విషాదం నెలకొంది. నూతన వరుడికి పసుపు పెడుతూ ఓ అతిథి గుండెపోటుకు గురయ్యాడు. వరుడి కాళ్ల ముందు కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి.
Hyderabad | ఉత్సాహంగా కొనసాగుతున్న హల్దీ ఫంక్షన్లో విషాదం నెలకొంది. నూతన వరుడికి పసుపు పెడుతూ ఓ అతిథి గుండెపోటుకు గురయ్యాడు. వరుడి కాళ్ల ముందు కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని కాలాపత్తార్ ఏరియాలో ఫిబ్రవరి 20వ తేదీన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. కాలాపత్తార్ ఏరియాలో ఓ వివాహ వేడుక నిమిత్తం.. ఆ ఇంట్లో 20వ తేదీన హల్దీ ఫంక్షన్ నిర్వహించారు. అందరూ సరదాగా నవ్వుతూ.. హల్దీ వేడుకల్లో మునిగి తేలుతున్నారు. మహ్మద్ రబ్బానీ(40) అనే అతిథి కూడా వరుడికి పసుపు పెట్టేందుకు ముందుకు వచ్చాడు. ఇక చైర్‌పై కూర్చొని పసుపు పెడుతుండగా గుండెపోటుకు గురయ్యాడు. బంధువులందరూ అప్రమత్తమై ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మహ్మద్ రబ్బానీ ఓ జ్యువెలరీ షాపులో పని చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రబ్బానీ మృతి కారణంగా పెళ్లిని వాయిదా వేసుకున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
Punjab | టోల్ ఫీ తప్పించుకునే యత్నంలో కారు బీభత్సం..!
Potassium | వ్యాయామం చేస్తున్నారా.. పొటాషియం ఉండే వీటిని తింటే మేలు..
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

