కొలువుదీరిన ప్రాచీన హస్తకళలు
లామకాన్‌లో ప్రాచీన హస్తకళల ప్రదర్శన శనివారం ఉదయం కొలువుదీరింది. ఆయా చిత్రమాలికలు సందర్శకులందరినీ ఆకట్టుకుంటున్నాయి. బెల్ మెటల్, కలంకారి, ఇక్కత్ వస్ర్తాలు ప్రదర్శనలో ఉన్నాయి.
సిటీబ్యూరో, మార్చి 12(నమస్తే తెలంగాణ) : లామకాన్‌లో ప్రాచీన హస్తకళల ప్రదర్శన శనివారం ఉదయం కొలువుదీరింది. ఆయా చిత్రమాలికలు సందర్శకులందరినీ ఆకట్టుకుంటున్నాయి. బెల్ మెటల్, కలంకారి, ఇక్కత్ వస్ర్తాలు ప్రదర్శనలో ఉన్నాయి. బనానా ఫైబర్, ఫైన్ యాపిల్ ఫైబర్, జ్యూట్ వస్తువులు, పట్ట చీర, చేర్యాల బొమ్మలతో పాటు తాళపత్ర గ్రంథాలను ప్రదర్శనలో ఉంచారు. ప్రధానంగా 60 ఏండ్ల కింద గీసిన రామాయణ గాథను పురాతన హస్తకళా వస్తువులు ప్రతిబింబంగా నిలుస్తున్నాయి. ఇందులో సంపూర్ణ రామాయణ గాథలను చిత్రించినట్లు నిర్వాహకుడు రమేశ్ రామనాథన్ వివరించారు. గుహల్లో పెయింటింగ్‌కు ఉపయోగించిన రాతి వస్తువులు, 350 ఏండ్ల కిందటి రాతప్రతులు ప్రదర్శనలో ఉన్నాయి. సాయంత్రం 6 గంటలకు ‘ఏ ఫిస్యూర్డ్ హారిజాన్-ది కాంట్రడిక్షన్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ’ అనే అంశంపై ప్రముఖ జర్నలిస్ట్ వినోద్ కె.జోన్ ప్రసంగించారు. అనంతరం, ‘బైఠక్-ఏ హిందుస్తానీ మ్యూజికల్ ఈవెనింగ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

