సీసీసీ అత్యద్భుతంగా ఉంది
శాంతి భద్రతలు సుస్థిరంగా ఉన్నప్పుడే ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. ఇందుకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శం. టెక్నాలజీతో కూడిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది.
- దేశానికే ఆదర్శం.. తెలంగాణ
- సుస్థిరమైన భద్రతతో ఆర్థిక అభివృద్ధి
- 1991-92వ బ్యాచ్ ఐపీఎస్ అధికారులు
- తెలంగాణ పోలీసు సంస్కరణలు వివరించిన సీపీ సీవీ ఆనంద్
శాంతి భద్రతలు సుస్థిరంగా ఉన్నప్పుడే ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. ఇందుకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శం. టెక్నాలజీతో కూడిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన టీఎస్పీఐసీసీసీ కేంద్రం అద్భుతంగా ఉన్నది. దీన్ని చూసి ఫిదా అయ్యాం. శాంతి భద్రల నిర్వహణ, నేరాల నిరోధం, ట్రాఫిక్ నిర్వహణ, హైదరాబాద్ పోలీసులు ఉపయోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం తెలుసుకోవడం సంతోషంగా ఉన్నది. ఇక్కడ పోలీసింగ్లోని సంస్కరణలు మా రాష్ర్టాల్లో కూడా అమలయ్యేలా చూస్తాం.
పలు రాష్ర్టాలకు చెందినఐపీఎస్ అధికారులు
60 మంది 1991/92 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారులు, వారి కుటుంబ సభ్యులు శుక్రవారం నేషనల్ పోలీస్ అకాడమీలో జరిగిన 30వ రీయూనియన్ సెమినార్లో పాల్గొని తమ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. అలాగే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయాన్ని సందర్శించారు. నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కూడా అదే బ్యాచ్ ఐపీఎస్ అధికారి కావడంతో తెలంగాణ పోలీసు విభాగంలో టెక్నాలజీ పరంగా వచ్చిన సంస్కరణలు, రాష్ట్ర పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్(టీఎస్పీఐసీసీసీ) ప్రాముఖ్యత, హైదరాబాద్ శాంతి భద్రతల పరిరక్షణ, నేర నివారణ, ట్రాఫిక్ విభాగంలో తీసుకుస్తున్న మార్పులు తదితర అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ… బహుళ అప్లికేషన్లతో అన్ని విభాగాలకు రాష్ర్ట వ్యాప్త సేవలకు ఉపయోగపడేలా ప్రభుత్వం నిర్మించిన బహుళ ఏజెన్సీల ఆపరేషన్ కేంద్రం అని పేర్కొన్నారు. సీసీటీవీలు, ట్రాఫిక్, వాతావరణ అసాధారణ పరిస్థితులలో అత్యవసరంగా అన్ని విభాగాలు ఒకే చోటకు చేరి, క్షేత్ర స్థాయిలో జరిగే పరిణామాలను ఇక్కడి నుంచి పరిశీలిస్తూ విపత్కర పరిస్థితులో నిర్ణయాలు తీసుకోవచ్చని తెలిపారు. జీయో ఫెన్సింగ్ అలర్ట్స్, వేడుకలు, రాజకీయ పార్టీల సభలు, సమావేశాలు, డయల్ 100, తదితర సేవలు ఇలా అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తూ ప్రజలకు వేగంగా సేవలు అందిస్తున్నామని వివరించారు. హైదరాబాద్లో అమలవుతున్న స్మాష్, హెచ్న్యూ, ఆపరేషన్ రోప్ వంటి కార్యక్రమాల గూర్చి, భిన్న సంస్కృతులకు నిలయంగా ఉన్న నగరంలో పోలీసింగ్ చేస్తున్న విధానం, ఎదుర్కొంటున్న సవాళ్ల గూర్చి సీపీ వివరించారు. అనంతరం పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్, హర్యానా డీజీ(అడ్మిన్) ఓపీ సింగ్, గౌహతి పోలీస్ కమిషనర్ హమిత్సింగ్ తదితరులు మాట్లాడారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ భవనంపై హెలీప్యాడ్, అందులో ఆడిటోరియం భవనంలోని కీలక విభాగాలను కూడా సందర్శించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

