మోడల్ కారిడార్లు సరికొత్త జంక్షన్లు
విదేశీ హంగులను తలపించేలా రహదారులు, కూడళ్లు చకచకా ముస్తాబు అవుతున్నాయి. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే సంకల్పంలో భాగంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విశాలమైన రోడ్లు ఏర్పాటు చేస్తున్నారు.
- విదేశీ హంగులు తలపించేలా గ్రేటర్ రోడ్లు
- అంతర్జాతీయ ప్రమాణాలతో విశాలమైన రహదారులు
సిటీబ్యూరో, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): విదేశీ హంగులను తలపించేలా రహదారులు, కూడళ్లు చకచకా ముస్తాబు అవుతున్నాయి. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే సంకల్పంలో భాగంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విశాలమైన రోడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా పైలెట్ ప్రాజెక్టుగా మూడు మోడల్ కారిడార్లను ఎంపిక చేసి రూ.16.7 కోట్లతో పనులు చేపడుతున్నారు. నానక్‌రాంగూడ జంక్షన్ నుంచి ఐటీ హైట్స్ రోడ్, బయోడైవర్శిటీ నుంచి లెదర్ ఇన్స్టిట్యూట్, ఐటీ హైట్ రోడ్స్ నుంచి ఖాజాగూడ జంక్షన్ వరకు మోడల్ కారిడార్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించగా, ఇందులో నానక్‌రాంగూడ జంక్షన్ నుంచి ఐటీ హైట్స్ రోడ్ కారిడార్ పనులను పూర్తి చేశారు. మూడు నుంచి నాలుగు వరుసల్లో మెయిన్ క్యారేజ్ వే, ఈ మెయిన్ క్యారేజ్ వే మధ్యన సెంట్రల్ మీడియన్, ఈ ప్రధాన రహదారికి పక్కన అడుగున్నర మేరలో ఒక వరుసలో గ్రీనరీ, తర్వాత ఫుట్‌పాత్, పక్కనే సైకిల్ ట్రాక్, ట్రాక్ పక్కన ఫుట్‌పాత్ ఉండనుంది. ట్రాఫిక్‌కు శాశ్వత నియంత్రణతో పాటు దేశంలోని ఇతర మెట్రో నగరాలకు ఆదర్శంగా నిలవనుంది.
చకచకా జంక్షన్ల అభివృద్ధి పనులు..
గ్రేటర్లో ట్రాఫిక్ జంక్షన్లు సరికొత్త రూపును సంతరించుకుంటున్నాయి. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, పాదాచారుల భద్రతతో పాటు సులభంగా వెళ్లడం, వాహనాల వేగం తగ్గడం, తద్వారా ప్రమాదాలను అరికట్టడం లక్ష్యంగా జంక్షన్లను అభివృద్ధి చేస్తున్నారు. 350కి పైగా జంక్షన్లు ఉండగా, ఇందులో మేజర్ జంక్షన్లు 114 ఉన్నాయని గుర్తించిన అధికారులు అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు సిగ్నల్ వ్యవస్థతో పాటు పాదచారుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ జంక్షన్ అభివృద్ధి చేయడంతో పాటుగా మరింత మెరుగు పరిచేందుకు నగరంలో ప్రయోగాత్మకంగా 12 కూడళ్లను వినూత్నంగా అభివృద్ధి చేస్తున్నది. పెరుగుతున్న వాహన రద్దీ తట్టుకునే విధంగా అవసరమైన చోట రోడ్డు వెడల్పు చేస్తూ సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థను మెరుగు పరిచేందుకుగానూ ఈ చర్యలు చేపడుతున్నది. 12 కూడళ్లతో పాటు 102 జంక్షన్ల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు, పోలీస్ శాఖ సమన్వయంతో పనులు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

