Minister Talasani | ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకే నూతన బ్రిడ్జిల నిర్మాణం : మంత్రి తలసాని
Minister Talasani | హైదరాబాద్‌వాసుల ట్రాఫిక్ కష్టాలను తొలగించేందుకే నూతన బ్రిడ్జిల నిర్మాణం చేపడుతున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఇందిరాపార్క్ నుంచి వీఎస్టీ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులను శుక్రవారం ఉదయం మంత్రి పరిశీలించారు.
Minister Talasani | హైదరాబాద్‌వాసుల ట్రాఫిక్ కష్టాలను తొలగించేందుకే నూతన బ్రిడ్జిల నిర్మాణం చేపడుతున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఇందిరాపార్క్ నుంచి వీఎస్టీ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులను శుక్రవారం ఉదయం మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే మొట్టమొదటి స్టీల్ బ్రిడ్జి ఇదేనని తెలిపారు. ఈ బ్రిడ్జికి మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టడం హర్షణీయమని పేర్కొన్నారు. ఈ స్టీల్ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శనివారం ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. ఈ బ్రిడ్జి ప్రారంభోత్సవంతో ఇందిరా పార్క్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, వీఎస్టీ జంక్షన్లో ట్రాఫిక్ కష్టాలు తీరతాయని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం, రోడ్ల అభివృద్ధి జరుగుతున్నాయని తెలిపారు. ఎస్ఆర్డీపీలో 48 ప్రాజెక్టులు చేపట్టగా.., ఇప్పటి వరకు 35 ప్రాజెక్టులయ్యాయి. వీఎస్టీ ఫ్లై ఓవర్ 36వది. అయితే, వాటిలో 19 ఫ్లై ఓవర్లు, ఐదు అండర్‌పాస్‌లు, 7 ఆర్వోబీ/ఆర్యూబీ, ఒక కేబుల్ బ్రిడ్జి, పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జి, పంజాగుట్ట రహదారి, ఓఆర్ఆర్ మెదక్ రోడ్ ఉంది. కాగా, 20వ ఫ్లై ఓవర్‌గా స్టీల్ బ్రిడ్జి నిలవనుంది. ఎస్ఆర్డీపీలో ఫ్లై ఓవర్ అవసరాన్ని బట్టి స్టీల్‌ను వినియోగించారు. బంజారాహిల్స్ శ్మశాన వాటిక, మల్కం చెరువు సమీపంలో చేపట్టిన వంతెనకు కొంత మేరలో స్టీల్ వినియోగించగా.. ఈ ఫ్లై ఓవర్‌కు దాదాపు 20 మె ట్రిక్ టన్నుల ఉక్కును వాడారు. దక్షిణాదిన మొదటి పొడవైన వంతెన ఇది కావడం గమనార్హం. అంతే కాకుండా జీహెచ్ఎంసీ చరిత్రలో భూసేకరణ లే కుండానే నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టు ఇదే. హైదరాబాద్‌లో మై ట్రో రైల్ మార్గం మీదుగా నిర్మించిన ఫ్లై ఓవర్ కావడం మరో విశేషం. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్, తా ర్నాక, ఓయూ, చర్లపల్లి, అంబర్‌పేట, రామంతపూర్, ఉప్పల్ మీదుగా వరంగల్ వైపు వెళ్లే వారికి ప్రయాణం సులభతరం అవుతుంది. ఈ ఫ్లై ఓవర్‌కు దివంగత నాయిని నర్సింహారెడ్డి పేరును ప్రభుత్వం ఖరారు చేసింది.
స్టీల్ బ్రిడ్జి నిర్మాణం ప్రత్యేకత
☞ ఇందిరా పార్క్ నుంచి వీఎస్టీ వరకు 2.62 కిలోమీటర్ల పొడవుగల స్టీల్ ఫ్లై ఓవర్ నిర్మాణం
☞ ఎలివేటెడ్ కారిడార్‌లో 2.436 కిలోమీటర్లు కాగా, ఎగువ ర్యాంపు 0.106 కి.మీ., దిగువ ర్యాంపు 0.150 కి.మీ.
☞ రైట్ ఆఫ్ వే 22.20 మీటర్ల నుంచి 36.60 మీటర్ల ఎలివేటెడ్ కుడివైపు మార్గం, 4 లేన్లతో బై డైరెక్షనల్ ఫ్లై ఓవర్
ప్రయోజనాలు
☞ ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ స్టీల్ బ్రిడ్జీ ఫ్లై ఓవర్ (ఎలివేటెడ్ కారిడార్)తో రవాణా సౌకర్యం మెరుగుపడుతున్నది.
☞ గతంలో ఆర్టీసీ క్రాస్‌రోడ్ వద్ద విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఉండేది. ఈ ఫ్లై ఓవర్‌తో ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం లభించనుంది.
☞ ఓయూ, హిందీ మహా విద్యాలయం వరకు వెళ్లేందుకు ప్రయాణ సమయం తగ్గుతుంది.
☞ ఇందిరా పార్కు, అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, బాగ్ లింగంపల్లి క్రాస్ రోడ్లో ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం లభించనుంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

