పుస్తకాలు సామాజిక కార్యకర్తలు.. హైదరాబాద్ బుక్ ఫెయిర్ సక్సెస్: జూలూరి గౌరీ శంకర్
గంగా జమున తెహజీబ్ సంస్కృతి కి ప్రతీకగా నిలిచిన తెలంగాణ సంస్కృతి దేశమంతా వ్యాపించాలని కోరుకున్న మహాత్మాగాంధీ సందేశాన్ని ఈతరం దగ్గరకు తీసుకపోయేందుకు ఏర్పాటు చేసిన వజ్రోత్సవ పుస్తక ప్రదర్శన విజయవంతమయ్యిందని తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్, హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్ తెలిపారు. ఎల్.బి.స్టేడియంలో ఆదివారం సాయంత్రం పుస్తక ప్రదర్శన ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడారు. కులం, మతం పేరున సమాజాన్ని ముక్కలు చేసే యత్నాలు చేసే విషభావజాలాలను తిప్పికొట్టేందుకు పుస్తకాలు ఎంతో దోహదం చేస్తాయన్నారు.
మనిషిని మనిషి ప్రేమించే సామాజికతత్వాన్ని, లౌకికతత్వాన్ని ఎద ఎదలో నాటడానికి పుస్తకాలు సామాజిక కార్యకర్తల్లా పనిచేస్తాయని చెప్పారు. మహాత్ముని ఆశయాలను వజ్రోత్సవాల సందర్బంగా పునశ్చరణ చేసుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అభీష్టం మేరకు జరిగిన వజ్రోత్సవ పుస్తక ప్రదర్శన విజయవంతమైందన్నారు. మనుషులందరూ ఒక్కటేనన్న సమానత్వం గీతంగా నిలిచిన తెలంగాణ సంస్కృతిని, చరిత్రను పరిరక్షించుకోవాల్సిన భాద్యత పౌరసమాజంపై ఉందని వివరించారు.
మానవత్వాన్ని, మత సామరస్యాన్ని, చాటిచెప్పే గాంధీ భోదనలను ఈతరం భుజాలకెత్తుకున్నప్పుడే భవిష్యత్ భారతావనిలో సమైక్యత మరింత పటిష్టంగా నిలుస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ దార్శనిక ఆలోచనలతో ఈ నెల 8 నుంచి 21వ తేదీ వరకు 22 లక్షల మంది విద్యార్ధులు గాంధీ చిత్రాన్ని చూడడం భావితరంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుందన్నారు.
జ్ఞాన తెలంగాణ నిర్మాణానికి ఈ పుస్తక ప్రదర్శనలను 33 జిల్లాల వాకిళ్ల దాకా తీసుకపోతామని ప్రకటించారు. ఈ ముగింపు సభకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ కార్యదర్శి కోయ చంద్రమోహన్ అధ్యక్షత వహించగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గౌరవ సలహాదారులు ఎం.బి గోనారెడ్డి, నిర్వాహకులు యానాల ప్రభాకర్ రెడ్డి, హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఉపాధ్యక్షులు శృతికాంత్ భారతి, రచయిత మనోహరచారి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

