HYD Rains | హైదరాబాద్ నగరంలో పలుచోట్ల సోమవారం సాయంత్రం వర్షం కురిసింది. మియాపూర్, చందానగర్ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. వర్షం నేపథ్యంలో హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఇటీవల ఎండలు దంచికొడుతున్నాయి. మార్చికి ముందే ఎండలో తీవ్రరూపం దాల్చడంతో జనం వేడి, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. తాజాగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు.
ఇదిలా ఉండగా.. రాగల మూడురోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని.. పలుచోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. గరిష్ఠంగా 34 డిగ్రీలు, కనిష్ఠంగా 22 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని చెప్పింది. దక్షిణ దిశ నుంచి ఉపరితల గాలులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం వివరించింది.