చిక్కడపల్లి, జనవరి 17: భార్యను కొట్టిన భర్తకు ఐదు రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ ఎన్.సంజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బాగ్‌లింగంపల్లి పాలమూరు బస్తీకి చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ సాజిద్ అన్వర్ (30)భార్యను కొట్టడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు అన్వర్‌ను అదుపులోకి తీసుకుని మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. సాజిద్ అన్వర్‌కు ఐదు రోజుల సాధారణ జైలు శిక్ష విధించారు.