లింకులు క్లిక్ చేస్తే లాభమంటూ..
యూట్యూబ్ లింకులు క్లిక్ చేసి డబ్బు సంపాదించవచ్చనే ఆశతో.. ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ పలు సార్లు పెట్టుబడి పెట్టి రూ. 36 లక్షలు పోగొట్టుకున్నాడు. పార్ట్‌టైమ్ జాబ్ పేరుతో బాధితుడికి వాట్సాప్‌కు మేసేజ్ వచ్చింది.. ఆ మేసేజ్ క్లిక్ చేయగానే టెలిగ్రామ్‌లోకి వెళ్లింది.
- సాఫ్ట్వేర్ ఉద్యోగులకు రూ. 50 లక్షలు టోకరా
- పార్ట్‌టైమ్ జాబ్ పేరుతో వాట్సాప్‌కు మెసేజ్
- పలు సార్లు పెట్టుబడి పెట్టిన బాధితులు
- తండ్రి మృతితో వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులను వాడేసిన ఘనుడు
సిటీబ్యూరో, మే 4 (నమస్తే తెలంగాణ) : యూట్యూబ్ లింకులు క్లిక్ చేసి డబ్బు సంపాదించవచ్చనే ఆశతో.. ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ పలు సార్లు పెట్టుబడి పెట్టి రూ. 36 లక్షలు పోగొట్టుకున్నాడు. పార్ట్‌టైమ్ జాబ్ పేరుతో బాధితుడికి వాట్సాప్‌కు మేసేజ్ వచ్చింది.. ఆ మేసేజ్ క్లిక్ చేయగానే టెలిగ్రామ్‌లోకి వెళ్లింది. అక్కడ యూట్యూబ్‌కు సంబంధించిన లింక్‌లు క్లిక్ చేయాలి .. ఎన్ని క్లిక్‌లు చేస్తే అన్ని డబ్బులొస్తాయి. అయితే అందుకు కొంత ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందంటూ ఒక లింక్‌ను పంపించారు.
ఆ లింక్ క్లిక్ చేయగానే ఒక యాప్ డౌన్లోడ్ అయ్యింది. ఆ యాప్ డౌన్లోడ్ కాగానే రూ. 500 పెట్టుబడి పెడితే కొన్ని యూట్యూబ్ లింక్‌లు క్లిక్ చేసే అవకాశం ఇచ్చారు. ఆ తరువాత రూ. 700 లాభం వచ్చిందంటూ స్క్రీన్‌పై చూపించింది, దానిని బాధితుడు డ్రా చేశాడు. అనంతరం మరింత ఎక్కువ పెట్టుబడి పెడితే భారీ లాభాలొస్తాయంటూ నమ్మించారు. తక్కువ మొత్తం పెట్టినప్పుడు డబ్బు డ్రా చేసుకునే అవకాశమిచ్చారు. ఆ తరువాత పెట్టుబడి లక్షల్లో పెట్టడంతో స్క్రీన్‌పై లాభాలు కన్పించాయి, వాటిని డ్రా చేసుకునే వీలులేకుండా పోయింది.
వాటిని డ్రా చేసుకోవాలంటే మరిన్ని టాస్క్‌లు పూర్తి చేయాలంటూ సైబర్‌నేరగాళ్లు మరింత డబ్బు పెట్టించారు. ఇలా పలు సార్లు రూ. 36 లక్షలు పెట్టుబడి పెట్టాడు. అయితే సగంలో ఆపేస్తే అప్పటి వరకు పెట్టిన డబ్బు పోతుందని, సైబర్‌నేరగాళ్లు చెప్పినట్లు టాస్క్‌లు పెంచుకుంటూ పోయానని, ఇందులో తన తండ్రి చనిపోయిన తరువాత వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బులు, అమ్మ సేవింగ్స్‌ను కూడా పెట్టుబడి పెట్టానంటూ బాధితుడు సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసుల ముందు తన ఆవేదన వెలిబుచ్చాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
మరో ఘటనలో వనస్థలిపురం వాసికి..
సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న వనస్థలిపురం వాసికి పార్ట్‌టైమ్ పేరుతో వాట్సాప్‌కు ఒక మేసేజ్ వచ్చింది. యూట్యూబ్ వీడియోలు లైక్ చేస్తే చాలు మీకు డబ్బులు వస్తాయంటూ ఆ మేసేజ్‌లో పేర్కొన్నారు. అనంతరం టెలిగ్రామ్ యాప్‌లోకి తీసుకెళ్లి రూ. 500 పెట్టుబడి పెట్టించారు. అందులో రూ.150 లాభం వచ్చింది. తిరిగి రూ. వెయ్యి పెట్టుబడి పెట్టించడంతో రూ. 300 లాభం వచ్చింది. నమ్మకం కుదరడంతో రూ. 25 వేలు పెట్టుబడి పెట్టగా.. ఇక్కడ కూడా రూ. 15 వేలు లాభం చూపించారు. దీంతో పూర్తి నమ్మకం కుదిరిన బాధితుడు పలు సార్లు రూ. 13.07 లక్షలు పెట్టుబడి పెట్టి మోసపోయాడు. ఈ మేరకు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

