సిటీబ్యూరో, మార్చి 8 (నమస్తే తెలంగాణ) ;నగర వీధులు రంగులతో నిండిపోయాయి. యువత కేరింతలతో సందడిగా మారాయి. గ్రేటర్లో బుధవారం సైతం పలు చోట్ల హోలీ సంబురాలు అంబర్నాంటాయి. ఘనంగా వేడుకలు చేసుకున్న నగరవాసులు.. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ‘రెయిన్ డ్యాన్స్’, ‘మ్యూజిక్ మస్తీ’లో మునిగితేలారు.. ఆనందంతో చిందేశారు.నగరంలో బుధవారం జరిగిన హోలీ వేడుకల్లో ఉత్సాహం ఉరిమింది. నెక్లెస్‌రోడ్‌తో పాటు గ్రేటర్ వ్యాప్తంగా పలు చోట్ల ఏర్పాటు చేసిన హోలీ ప్రత్యేక కార్యక్రమాల్లో రంగులు చల్లుకుంటూ.. నగరవాసులు ఫుల్ జోష్‌తో సందడి చేశారు. మ్యూజిక్ మస్తీ, రెయిన్ డ్యాన్స్‌లు ‘కలర్ ఫుల్’గా సాగాయి.
–