సిటీబ్యూరో, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ) : ప్రముఖ జియోస్పేషియల్, ఇండస్ట్రియల్ టెక్నాలజీస్ కంపెనీ హెక్సగాన్ సీసీఐ(Hexagon CCI) టీహబ్‌తో(T-Hub) కలిసి స్టార్టప్(Startups) క్యాటలిస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా స్టార్టప్‌లను ప్రోత్సహిచేందుకు 12 స్టార్టప్‌లను ఎంపిక చేశారు. 100 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో డిజిటల్ ట్విన్, రియల్ టైమ్ ల్యాంగేజ్ ట్రాన్స్లేషన్, ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ యూజింగ్ ఏఐ మోడల్స్ అంశాల్లో స్టార్టప్‌ల కార్యకలాపాలు ఉంటాయి. టీ హబ్ నిర్వహిస్తున్న ల్యాబ్ 32లో ఉన్న స్టార్టప్‌లను ఎంపిక చేసి, స్టార్టప్ క్యాటలిస్ట్ కార్యక్రమాన్ని హెక్సగాన్ సీసీఐ నిర్వహిస్తుందని టీహబ్ ప్రతినిధి తెలిపారు.