హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం
Heavy Rains | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఇవాళ మధ్యాహ్నం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఉదయం కాస్త ఎండ, చల్లని వాతావరణం ఏర్పడిన హైదరాబాద్‌లో.. మధ్యాహ్నం సమయానికి వాన దంచికొట్టింది. దీంతో భాగ్యనగరం తడిసి ముద్దైంది. పలు చోట్ల వర్షపు నీరు రహదారులపై
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఇవాళ మధ్యాహ్నం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఉదయం కాస్త ఎండ, చల్లని వాతావరణం ఏర్పడిన హైదరాబాద్‌లో.. మధ్యాహ్నం సమయానికి వాన దంచికొట్టింది. దీంతో భాగ్యనగరం తడిసి ముద్దైంది. పలు చోట్ల వర్షపు నీరు రహదారులపై నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మరో రెండు గంటల వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఇక సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, జనగామ, యాదాద్రి భువనగిరి, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో కూడా వర్షాలు కుండపోతగా కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

