హైదరాబాద్‌లో భారీ వర్షం
Heavy rain | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. గత నాలుగైదు రోజుల నుంచి నగర వ్యాప్తంగా చల్లని గాలులు వీస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి, సోమ,
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. గత నాలుగైదు రోజుల నుంచి నగర వ్యాప్తంగా చల్లని గాలులు వీస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం రాత్రి, సోమ, మంగళవారాల్లో తెల్లవారుజామున వర్షం కురిసింది. మరోసారి మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి భాగ్యనగరం తడిసి ముద్దయింది. మధ్యాహ్నం సమయంలో ఎండ దంచికొట్టింది.
నాంపల్లి, కోఠి, అబిడ్స్, లక్డీకాపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, మాదాపూర్, మెహిదీపట్నం, లంగర్ హౌజ్, మలక్‌పేట్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, ఫలక్‌నూమా, చార్మినార్, నాచారం, తార్నాక, హబ్సిగూడ, రాంనగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, ముషీరాబాద్, సికింద్రాబాద్, ప్యారడైజ్, బేగంపేట్, సనత్ నగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది.
వర్షం కారణంగా హైదరాబాద్ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో పోలీసులు క్రమబద్దీకరించారు. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

