e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home హైదరాబాద్‌ చక్కని జీవనశైలితో మెరుగైన ఆరోగ్యం

చక్కని జీవనశైలితో మెరుగైన ఆరోగ్యం

చక్కని జీవనశైలితో మెరుగైన ఆరోగ్యం
 • తప్పక వ్యాయాయం చేయాలి.. కంటి నిండా నిద్ర పోవాలి
 • రోగ నిరోధక శక్తితోనే కరోనాను జయించవచ్చు
 • అపోలో ఆసుపత్రి సీనియర్‌ఎండోక్రినాలజిస్ట్‌, డాక్టర్‌ రవిశంకర్‌

‘ఆరోగ్యం బాగుంటే అన్నీ ఉన్నట్లే’ అని ప్రతిఒక్కరూ భావిస్తున్న సందర్భమిది. కంటికి కనబడని సూక్ష్మజీవి అల్లకల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో చక్కని జీవనశైలి అలవర్చుకుంటే చిక్కటి ఆరోగ్యం మన సొంతమవడం ఖాయమని అపోలో దవాఖాన సీనియర్‌ ఎండోక్రినాలజిస్ట్‌ రవిశంకర్‌ ఇరుకులపాటి పేర్కొన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు అనేక సూచనలు, సలహాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయని.. దేన్ని పడితే దాన్ని పాటించకుండా నిపుణులు, వైద్యుల సూచనల మేరకు వాటిని పాటించడం శ్రేయస్కరమని అంటున్నారు. కరోనా వ్యాప్తితో మారుతున్న జీవన శైలిపై ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

కరోనాను ఎదుర్కొనేందుకు ఎలాంటి జీవన శైలి అలవర్చుకోవాలి?

 • కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు మందుగా మన శరీరం, మససును సిద్ధం చేసుకోవాలి.
 • రోగ నిరోధక శక్తిని పెంచే మ్యాజిక్‌ మాత్రలు లేనందున శాస్త్రీయ పద్ధుతుల్లోనే పెంచుకోవాలి.
 • మనం తినే ఆహారంతోనే మన ఆరోగ్యం బాగుంటుంది. తాజా పండ్లు తినాలి.
 • సమతులమైన పోషకాహారాన్ని తీసుకోవాలి. హెర్బల్‌ రెమిడీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి.
 • ప్రతిరోజు వ్యాయామం చేయాలి.
 • 6 నుంచి 8 గంటల పాటు కంటి నిండా నిద్రపోవాలి. మంచి నిద్ర మన ఆరోగ్యాన్ని పెంచుతుంది.

శ్వాస సమస్యలకు పాటించాల్సిన విధానాలు?

 • క్రమం తప్పని వ్యాయామంతో శరీరం, ఊపిరితిత్తులు మంచి ఆరోగ్యకరమైన స్థితిలో ఉంటాయి.
 • ఊబకాయంతో ప్రమాదం ఎక్కువ. కొన్నిసార్లు మరణానికి దారి తీయవచ్చు.
 • ఊబకాయం ఉన్నవారికి కొవిడ్‌ సోకితే అది గుండెపోటు రావచ్చు.
 • మెదడు కూడా దెబ్బ తినవచ్చు. ప్రాణాయామం వంటివి క్రమం తప్పకుండా చేస్తే శ్వాస సంబంధ సమస్యలను ఎదుర్కొవచ్చు.

సోషల్‌ మీడియాలో వస్తున్న చిట్కాలపై మీ అభిప్రాయం?

 • కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి అనేక ఆరోగ్య చిట్కాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
 • వంటింటి చిట్కాలతో కలిగే ప్రయోజనాలను నిపుణులను అడిగి తెలుసుకోవాలి.
 • అనవసర భయాందోళనలు మంచివి కావు.
 • ప్రతి అంశాన్ని పాజిటివ్‌గా ఆలోచించాలి. వైద్యులు, నిపుణుల సూచన మేరకే కరోనా మందులు వాడాలి.

విటమిన్ల లోపాన్ని ఎలా అధిగమించాలి?

 • మహమ్మారిని ఎదుర్కోవడంలో ‘డి’ విటమిన్‌ పాత్ర అధికం. ప్రతిరోజు ఎండలో తిరగాలి.
 • ఆ పరిస్థితి లేకపోతే ‘డి’ విటమిన్‌ను ఇచ్చే పండ్లు, ఆహార పదార్థాలు తీసుకోవాలి.
 • మల్టీ విటమిన్‌ సప్లిమెంట్స్‌ను తీసుకోవాలి. శరీరలోని ఐరన్‌ లోపాన్ని అధగమించాలి.
 • అందరిలో ఈ లోపాలన్నీ ఉండవు. తగిన పరీక్షలు చేయించుకున్న తర్వాతే విటమిన్‌ లోపాలను సరిదిద్దుకోవాలి.

మనల్ని మనం ఎలా నియంత్రించుకోవాలి?

 • డయాబెటిస్‌ ఉన్న వారికి కరోనా సోకితే తీవ్ర పరిణామాలు తలెత్తుతాయి.
 • గ్లూకోజ్‌ నియంత్రణ సరిగా లేకుంటే వెంటిలేషన్‌, ఇంటెన్సివ్‌ కేర్‌కు వెళ్లాల్సిన అవసరం రావచ్చు.
 • అదేవిధంగా రక్తపోటును నియంత్రించుకోవాలి.
 • లేదంటే గుండెపోటు లాంటి సమస్యలు రావచ్చు. ధూమపానం, మద్యం తాగే వారు కొన్ని రోజులు వాటికి దూరంగా ఉండటం ఉత్తమం.
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
చక్కని జీవనశైలితో మెరుగైన ఆరోగ్యం

ట్రెండింగ్‌

Advertisement