విద్యుత్ బకాయిల చెల్లింపు
ఉప్పల్ క్రికెట్ స్టేడియం చెల్లించాల్సిన విద్యుత్ బిల్లుల బకాయిలను మంగళవారం చెల్లించింది. ఖైరతాబాద్‌లోని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం) కార్పొరేట్ కార్యాలయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్రావు మొత్తం బిల్లు రూ.1,48,94,521లను చెక్కు రూపంలో సీఎండీ ముషారఫ్ ఫరూఖీకి అందజేశారు.
- ఉప్పల్ స్టేడియం బిల్లులు చెల్లించిన హచ్‌సీఏ
- పదేళ్ల విద్యుత్ సమస్యకు పరిష్కారం
సిటీబ్యూరో, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ఉప్పల్ క్రికెట్ స్టేడియం చెల్లించాల్సిన విద్యుత్ బిల్లుల బకాయిలను మంగళవారం చెల్లించింది. ఖైరతాబాద్‌లోని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం) కార్పొరేట్ కార్యాలయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్రావు మొత్తం బిల్లు రూ.1,48,94,521లను చెక్కు రూపంలో సీఎండీ ముషారఫ్ ఫరూఖీకి అందజేశారు. 2015లో ఈ వివాదం మొదలైంది. ఐపీఎల్ క్రికెట్ జరుగుతున్న సమయంలో రూ.15 లక్షలు చెల్లించామని మిగిలిన మొత్తం 4 నుంచి 5 వాయిదాల్లో చెల్లిద్దామని ఆలోచన చేసినా హెచ్‌సీఏ పేరు ప్రతిష్టతలను దృష్టిలో ఉంచుకొని ఒకేసారి అంతా చెల్లించామని చెప్పారు. ఐపీఎల్ క్రికెట్ జరుగుతున్న సమయంలో విద్యుత్ బిల్లు పెండింగ్‌లో ఉందనే కారణంతో క్రికెటర్లు ప్రాక్టీసు చేస్తుండగా కరెంట్ కట్ చేసి, హైదరాబాద్, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సీఎండీని జగన్మోహన్రావు కోరారు. పదేండ్ల కింద మొదలైన ఈ సమస్యకు తమను బాధ్యులను చేస్తూ, ఐపీఎల్ జరుగుతున్న సమయంలో కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో పాటు జాతీయ స్థాయిలో ఈ విషయం సంచలనమైందని, ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

