వైభవంగా హనుమాన్ జయంతి
శామీర్పేట్ మండలం దేవరయంజాల్లోని సుమారు 250 సంవత్సరాల చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రాచీన అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం హనుమాన్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రంగా పేరుగాంచిన ఈ ఆలయానికి హనుమాన్ జయంతి సందర్భంగా వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నా రు.
- పంచామృత అభిషేకం.. వడమాల పూజలతో భక్తుల సందడి
- దేవరయాంజాల్లో ఆధ్యాత్మిక సందడి
శామీర్ పేట్, మే 12: శామీర్పేట్ మండలం దేవరయంజాల్లోని సుమారు 250 సంవత్సరాల చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రాచీన అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం హనుమాన్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రంగా పేరుగాంచిన ఈ ఆలయానికి హనుమాన్ జయంతి సందర్భంగా వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నా రు. ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకం, వడమాల పూజ, అష్టోత్తర పూజలు ఘనంగా నిర్వహించారు.
అనంతరం ప్రత్యేక ఆర్చనలు, మహా హారతులు నిర్వహించారు. హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించగా భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. సాయం త్రం హనుమాన్ సేవా కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానికుల విశ్వా సం ప్రకారం పెండ్లి కాని యువతులు ఈ ఆలయంలో స్వామివారిని నిష్టగా పూజిస్తే కల్యాణ యోగం కలుగుతుందని నమ్మకం. దీంతో పరిసర ప్రాం తాల నుంచి కూడా యువతులు పెద్ద సంఖ్యలో వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ ఈ. శ్రీనివాస్ మాట్లాడుతూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందడం ఆనందంగా ఉందన్నారు. గ్రామ యువత, హనుమాన్ యూత్ సభ్యులు ఉత్సవాల విజయవంతానికి విశేషంగా కృషి చేశారని తెలిపారు.
హనుమాన్ యూత్ సభ్యులు ఎడంబోయిన శ్రీనివాస్, జూపల్లి శ్రీనివాస్, అల్లాడి కృష్ణారెడ్డి, పీఆర్సీ రెడ్డి, అనిరుధ్, టింకు గౌడ్, దూసరి మహేష్ గౌడ్, పట్నం నర్సింహారెడ్డి, కౌడే వెంకటేశ్, బి.నగేష్ గౌడ్, మన్నె పురుషోత్తంరెడ్డి, బి.బాలింగ్ గౌడ్, ఎస్.సురేష్, సముద్రాల సురేష్ తదితరులు సేవలందించారు. ప్రత్యేక పూజల్లో మాజీ కౌన్సిలర్లు పి.నర్సింహారావు గౌడ్, యాదమ నర్సింహగౌడ్, రామాలయ ఆలయ మాజీ చైర్మన్లు పన్నాల సుధాకర్ రెడ్డి, పెండెం లక్ష్మీనారాయణ, జిల్లా ఆర్టీఏ సభ్యుడు జైపాల్ రెడ్డి, మలాజిగిరి ప్రెస్ క్లబ్ జనరల్ సెక్రటరీ విశాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

