కమలం‘గ్యాస్’ తీశారు..

- సిలిండర్కుదండం పెట్టి.. ఓటు వేసి..
- వినూత్నంగా బీజేపీకి చురక
- పెంచిన ధరలపై పట్టభద్రుల నిరసన
- మంత్రి కేటీఆర్‌ను అనుసరించిన నెటిజన్లు
నాడు మోడీ పిలుపు నిచ్చారు.. నేడు రాష్ట్ర మంత్రి కేటీఆర్ అమలు చేశారు. ఇదేమిటి అనుకుంటున్నారా.. నాడు కేంద్రంలో బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెరిగిన ధరలకు నిరసనగా నరేంద్ర మోడీ ఓటు వేసే ముందర గ్యాస్ సిలిండర్‌కు దండం పెట్టుకుని ఓటు వేయండి అంటూ పిలుపునిచ్చారు. ప్రస్తుతం అదే సీన్ మోడీకి వ్యతిరేకంగా మంత్రి కేటీఆర్ అమలు చేశారు. దీనికి పట్టభద్రులు విశేషంగా స్పందించడంతో సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించింది.

సిటీబ్యూరో, మార్చి 14 ( నమస్తే తెలంగాణ ) : ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్యాస్ సిలిండర్ హాట్ టాపిక్‌గా మారింది. పట్టభద్రులంతా సిలిండర్‌కు దండం పెట్టి ఓటింగ్‌లో పాల్గొనడం సర్వత్రా చర్చనీయంగా మారింది. మంత్రి కేటీఆర్ షేక్‌పేట్ తహసీల్దార్ కార్యాలయంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం “ఇంట్లో గ్యాస్ సిలిండర్‌కు దండం పెట్టుకుని వచ్చి ఓటు వేశా.” అని ప్రకటించారు. ఈ ఒక్క మాట సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించింది. ప్రతి ఒక్క పట్టభద్రుడు మంత్రి కేటీఆర్‌ను అనుసరించారు. తమ ఇండ్లల్లో ఉన్న గ్యాస్ సిలిండర్‌కు దండం పెట్టుకుని ఓటింగ్‌లో పాల్గొన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పోస్టింగ్‌లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టా, వాట్సాప్‌లలో గ్యాస్ సిలిండర్, పెట్రోల్ బంక్‌లను మొక్కుతున్న ఫొటోలు హోరెత్తాయి. పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా పట్టభద్రులు బీజేపీపై తమ నిరసనను ఈ విధంగా వ్యక్తం చేశారు.
సీన్ రివర్స్.. బీజేపీకి చురకలు
గతంలో కేంద్రంలో బీజేపీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ గ్యాస్ ధరలను పెంచడంతో.. నరేంద్ర మోడీ ఓటు వేసే ముందర గ్యాస్ సిలిండర్‌కు దండం పెట్టుకుని ఓటు వేయండి అంటూ పిలుపునిచ్చారు. ప్రస్తుతం అదే సీన్ మోడీకి వ్యతిరేకంగా అమలు చేశారు. కేంద్రం గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచడంతో ఓటర్లు దండం పెట్టుకుని ఓటింగ్‌లో పాల్గొన్నారు. పట్టభద్రులంతా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచిన కేంద్రంపై తమ ఆగ్రహాన్ని సోషల్ మీడియాలో వినూత్నంగా వ్యక్తం చేసి బీజేపీకి చురకలు అంటించారు.
పోస్టులు ఇలా..!!
- నెటిజన్ వినయ్ అనే వ్యక్తి ఇంట్లో గ్యాస్ బండకు దండం పెట్టి ఓటు వేశాను అని వీడియో పోస్ట్ చేశాడు.
- కుమారి అనే పట్టభద్రురాలు ఓటు వేసే ముందర ఇంట్లోని గ్యాస్ సిలిండర్‌కు దండం పెట్టుకున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
- తాళ్ల సాయి చంద్రగౌడ్ అనే పట్టభద్రుడు పెట్రోల్ బంక్‌కు దండం పెట్టుకుని ఓటు వేశానని తెలిపాడు.
- పట్ట విష్ణువర్ధన్ రెడ్డి ఓటు వేయడానికి ముందర పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా పెట్రోల్ బంక్‌కు దండం పెట్టుకుని ఎమ్మెల్సీ ఓటు వేశానని సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేశాడు.
- ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళుతూ.. మార్గమధ్యంలో పెట్రోల్ బంక్‌కు దండం పెట్టి ఓటు వేశానని టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కిశోర్ గౌడ్ సోషల్ మీడియలో పోస్ట్ చేశాడు.
- ఇలా వేలాది మంది నెటిజన్లు గ్యాస్ సిలిండర్, పెట్రోల్ బంక్‌లకు దండం పెట్టుకుని ఓటింగ్‌లో పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

