రేపటినుంచే గోల్కొండ బోనాలు

- జూలై 11న తొలి బోనం.. ఆగస్టు 8న చివరి బోనం
- ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించనున్న మంత్రు
మెహిదీపట్నం, జూలై 9: ఆషాఢ మాసం బోనాలు రేపటినుంచి ప్రారంభంకానున్నాయి. గడిచిన ఏడాది కరోనా కారణంగా ఉత్సవాలకు దూరమైన ప్రజలు ఈ ఏడాది అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఆదివారం గోల్కొండ కోటలోని జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో మొదటి బోనం సమర్పించనున్నారు. దీంతో నగర వ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకోనున్నది. ఇప్పటికే సీఎం కేసీఆర్ బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించగా.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయ ట్రస్టు కమిటీ సభ్యులు, దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆదివారం ఉదయం 11 గంటలకు లంగర్‌హౌస్ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున జగదాంబిక ఎల్లమ్మకు మంత్రులు పట్టువస్ర్తాలను సమర్పించడంతో ఊరేగింపు ప్రారంభమవుతుంది. కులవృత్తుల సంఘం తరఫున నజర్ బోనంను ఊరేగింపుగా తీసుకువచ్చి సమర్పిస్తారు. జూలై 11న మొదటి బోనం.. ఆగస్టు 8వ తేదీన 9వ బోనం సమర్పించనున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చే లక్షలాది మంది భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు జరుపుకునేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- golkonda bonalu 2021
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

