జూలై 11న గోల్కొండ బోనాలు షురూ

- ప్రతి గురు, ఆదివారాల్లో బోనాలు సమర్పణ
- కొవిడ్ నిబంధనలతో వేడుకల నిర్వహణ
- ఏర్పాట్లలో అధికారులు, ఆలయ కమిటీ
మెహిదీపట్నం జూన్ 26: ఈసారి ఆషాడ బోనాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని నిర్ణయించడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది. ఈ నేపథ్యంలో జూలై 11న గోల్కొండ కోటపైనున్న జగదాంభిక ఎల్లమ్మ ఆలయంలో జరిగే మొదటి బోనం పూజతో ఈ ఏడాది బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలకు దేవాదాయశాఖ అధికారులు, బోనాల ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.
తొమ్మిది పూజలతో గోల్కొండ బోనాలు
గోల్కొండ కోటలో జూలై 11న (ఆదివారం) బోనాలు ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అయితే ప్రతి ఆదివారం, గురువారం బోనాల సమర్పణ, పూజలు జరుగుతాయి. జూలై 11న మొదటిపూజ, 15న రెండో పూజ, 18న మూడో పూజ, 22న నాలుగో పూజ, 25న 5వ పూజ, 29న 6వ పూజ, ఆగస్టు1న 7వ పూజ, 5న 8వ పూజ, 8న 9వ పూజ జరుగనున్నది.
చురుకుగా ఏర్పాట్లు: కోయల్‌కార్ గోవింద్రాజ్, చైర్మన్
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గోల్కొండ కోటలో ఆషాడం బోనాలను ఘనంగా నిర్వహించడానికి చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొవిడ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తాం. ప్రజలు కూడా కొవిడ్ నిబంధనలు పాటించాలి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- golkonda bonalu 2021
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

