మరింత పకడ్బందీగా పారిశుధ్యం

- 58 రద్దీ ప్రాంతాల్లో కొత్తగా 1850 తడి-పొడి డబ్బాలు
- స్వచ్ఛతలో మేటిగా నిలపడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ చర్యలు
హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛతలో అగ్రస్థానంలో నిలిపే ప్రక్రియను జీహెచ్ఎంసీ వేగవంతం చేసింది. స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా ఇప్పటికే తడి, పొడి చెత్త వేర్వేరు, ఇంటింటి నుండి చెత్త సేకరణ, కాలనీ, బస్తీ సంక్షేమ సంఘాల భాగస్వామ్యం, ఓడీఎఫ్‌కు చర్యలు, బహిరంగ మలమూత్ర విసర్జన నివారణ చర్యలు, స్వచ్ఛతపై చైతన్య కార్యక్రమాలు, ప్లాస్టిక్ నిషేధం వంటి కార్యక్రమాలు పక్కాగా నిర్వహిస్తున్నది. ప్రధానంగా చెత్తకుండీలు లేని నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దే క్రమంలో దాదాపు 22 లక్షల గృహాలకు ఒక్కో ఇంటికి తడి, పొడి చెత్త సేకరణకు 44 లక్షల చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ఇంటింటి చెత్త సేకరణకు 3150 స్వచ్ఛ ఆటో టిప్పర్లను వినియోగిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా గ్రేటర్ వ్యాప్తంగా రద్దీగా ఉండే వాణిజ్య సంస్థల వద్ద పారిశుధ్య నిర్వహణ మరింత పకడ్బందీగా చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు 58 కమర్షియల్ ప్రాంతాలను గుర్తించారు. ఇక్కడ 100 మీటర్ల దూరంలో ట్విన్ డస్ట్బిన్లు (తడి, పొడి చెత్తకు) ఏర్పాటు చేస్తున్నారు. సాధారణంగా రద్దీగా ఉండే ఏరియాల్లో ప్రజలు చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా ఈ ట్విన్ బిన్స్లను ఏర్పాటు చేస్తున్నారు. 1850 ట్విన్ బిన్స్‌ల ఏర్పాటు ప్రక్రియను వచ్చే నెల మొదటి వారంలోగా పూర్తి చేయడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- GHMC
- swachh hyderabad
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

