వరద నీటి నివారణపై ప్రత్యేక దృష్టి
గ్రేటర్ వరద నీటి నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ అధికారులను ఆదేశించారు. గురువారం శేరిలింగంపల్లి జోన్ మాదాపూర్ సర్కిల్లో జోనల్ కమిషనర్ స్నేహ శబరీష్‌తో కలిసి కమిషనర్ మాదాపూర్ బాటా షోరూం,
- కమిషనర్ రొనాల్డ్ రాస్
సిటీబ్యూరో, జూన్ 6 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ వరద నీటి నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ అధికారులను ఆదేశించారు. గురువారం శేరిలింగంపల్లి జోన్ మాదాపూర్ సర్కిల్లో జోనల్ కమిషనర్ స్నేహ శబరీష్‌తో కలిసి కమిషనర్ మాదాపూర్ బాటా షోరూం, యశోద దవాఖాన, శిల్పారామం తదితర ప్రాంతాల్లో వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లను పరిశీలించారు. వరద నీరు నిలువకుండా శాశ్వత చర్యలు చేపట్టేందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. త్రిశూల్ గ్రాండ్ వద్ద సైడ్ రోడ్డు ప్రతిపాదనకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని, బాటా షోరూం వద్ద సైడ్ వెంట్స్ క్లియర్, డిసిల్టింగ్ చేయాలని, విక్రమ్ దవాఖాన రోడ్డులో కొత్త బాక్స్ డ్రైన్‌ను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎస్ఈ శంకర్, డిప్యూటీ కమిషనర్ పాల్గొన్నారు.
వేగవంతంగా ఆన్లైన్ దరఖాస్తులను పరిష్కరించాలి
జీహెచ్ఎంసీలో ఆన్లైన్ దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేయాలని కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపారు. ‘మై జీహెచ్ఎంసీ యాప్, జీహెచ్ఎంసీ వెబ్సైట్, డయల్ 100, కాల్ సెంటర్‌కు ఆన్లైన్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను ఆయా శాఖల అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. గురువారం జీహెచ్ఎంసీలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో వివిధ సమస్యలపై ఆన్లైన్లో వచ్చిన పెండింగ్ ఫిర్యాదులపై సమీక్షించారు. శాఖల వారీగా వచ్చిన గ్రీవెన్స్‌లను ప్రతి రోజు హెచ్వోడీలు పరిశీలించాలని, ఫిర్యాదు రాగానే సంబంధిత ఫిర్యాదుదారుడికి కాల్ చేసి తెలుసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఆయా విభాగాల హెచ్వోడీలు శ్రీ వాత్సవ, స్నేహ శబరీష్, ఈఎన్సీ జియా ఉద్దీన్, సీఈ దేవానంద్, అడిషనల్ కమిషనర్లు రవి కిరణ్, ఉపేందర్ రెడ్డి, యాదగిరి రావు, సత్యనారాయణ, నళిని పద్మావతి, మంగతాయారు, సునంద తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

