GHMC Commissioner Ronald Rose | ఎన్నికలకు నోడల్ అధికారుల నియామకం : జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్
GHMC Commissioner Ronald Rose | : అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడానికి నోడల్ అధికారులను నియమించి వారికి బాధ్యతలు అప్పగించామని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్(GHMC Commissioner Ronald Rose )తెలిపారు.
సిటీబ్యూరో, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ ) : అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడానికి నోడల్ అధికారులను నియమించి వారికి బాధ్యతలు అప్పగించామని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్(GHMC Commissioner Ronald Rose )తెలిపారు. శానిటేషన్ అడిషనల్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఆర్ ఉపేందర్ రెడ్డి పవర్ నోడల్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్ ఈవీఎం, వీవీ ప్యాట్ మేనేజ్మెంట్ నోడల్ అధికారి, రీజనల్ ఫైర్ ఆఫీసర్ ప్రసన్నకుమార్ ట్రాన్స్‌పోర్టు మేనేజ్మెంట్, జాయింట్ కమిషనర్ జయంత్‌రావు మెటీరియల్ మేనేజ్మెంట్, ఈవీడీఎం డైరెక్టర్ డైరెక్టర్ ప్రకాష్‌రెడ్డి ఎంసీసీ నోడల్ అధికారిగా నియమించారు.
పోలీస్ అడిషనల్ కమిషనర్ విక్రం సింగ్ మాన్ లా అండ్ ఆర్డర్, జిల్లా సెక్యూరిటీ ప్లాన్ నోడల్ అధికారిగా నియమించారు. ఖైరతాబద్ జోన్ ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వి. శరత్చంద్ర ఎక్సెపెండిచర్ మానిటరీ నోడల్ అధికారిగా నియమించారు. జీహెచ్ఎంసీ చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ మహమ్మద్ ఆలీ ముర్తుజా మీడియా, కమ్యూనికేషన్ నోడల్ అధికారిగా నియమించారు. అడిషనల్ కమిషనర్ ఎస్టేట్ గీతా రాధి ఐటీ రిలేటెడ్ నోడల్ ఆఫీసర్‌గా నియమించారు.
డిప్యూటీ కలెక్టర్లు పద్మప్రియ, అర్చన, శ్రీకాంత్ రిపోర్ట్ అండ్ రిటైన్స్ నోడల్ ఆఫీసర్లుగా నియమించారు. జీహెచ్ఎంసీ డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ ఆర్ సత్యనారాయణ రెడ్డి బేసిక్ మినిమమ్ ఫెసిలిటీస్ నోడల్ అధికారిగా, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పద్మజ హెల్త్ కేర్ ఆఫ్ పోలింగ్ పార్టీ అండ్ ఎలక్టర్స్ నోడల్ ఆఫీసర్‌గా నియమించారు.
పర్సనల్ ఆఫీసర్ ఎస్‌డబ్ల్యూఎస్ విజయభాస్కర్ రెడ్డి బ్యాలెట్ పేపర్ నోడల్ అధికారిగా, జాయింట్ కమిషనర్ అలివేలు మంగతాయరు, ఎలక్ట్రోరోల్స్ నోడల్ ఆఫీసర్‌గా నియమించారు. స్పోర్ట్స్ డైరెక్టర్ భాషా ఫిర్యాదులు, పరిష్కారం విభాగానికి నోడల్ ఆఫీసర్‌గా బాధ్యతలు అప్పగిస్తూ ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ ఉత్తర్వులు జారీ చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

