డంపింగ్‌తో..పరేషాన్.!
బస్తీలు,కాలనీలు అనే తేడా లేదు.. మెయిన్‌రోడ్లు, అంతర్గత రోడ్లు అనే భేదం లేదు.. ఎక్కడ పడితే అక్కడ లారీలు ఆపి వ్యర్థాలను రోడ్లపక్కన పారబోస్తున్నారు.
- రాత్రి వేళ్లల్లో రోడ్ల పక్కనే వ్యర్థాల పారబోత
- ఇబ్బందులు పడుతున్న వాహనదారులు, పాదచారులు
బంజారాహిల్స్,డిసెంబర్ 26:బస్తీలు,కాలనీలు అనే తేడా లేదు.. మెయిన్‌రోడ్లు, అంతర్గత రోడ్లు అనే భేదం లేదు.. ఎక్కడ పడితే అక్కడ లారీలు ఆపి వ్యర్థాలను రోడ్లపక్కన పారబోస్తున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ డివిజన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్మాణ వ్యర్థాల సమస్యలు తీవ్రంగా మారాయి. రాత్రిపూట కొంతమంది లారీల యజమానులు గుట్టుచప్పుడు కాకుండా నిర్మాణ వ్యర్థాలను తీసుకొచ్చి ఎక్కడపడితే అక్కడ డంపింగ్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ సర్కిల్ -18 పరిధిలోని పలు ప్రాంతాల్లో భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి. పాత భవనాలను కూల్చిన తర్వాత నిర్మాణవ్యర్థాలను డంపింగ్ యార్డ్‌కు తరలించేందుకు కాంట్రాక్ట్ తీసుకునే టిప్పర్ యజమానులు కాసులకు కక్కుర్తి పడి సమీపంలోని ఖాళీ స్థలాల్లో డంపింగ్ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 78లోని పద్మాలయ అంబేద్కర్‌నగర్ నుంచి భరణి లే అవుట్, న్యాయవిహార్, మహా ప్రస్థానం తదితర ప్రాంతాల్లో రహదారుల పక్కనే భారీగా డంపింగ్ చేయడంతో రోడ్డుపై రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45లోని భారతీయ విద్యాభవన్ ఆత్మకూరు రామారావు స్కూల్ వైపు నుంచి హార్ట్‌కప్ వైపునకు వచ్చే రోడ్డు పక్కన ఇష్టారాజ్యంగా వ్యర్థాలను డంపింగ్ చేస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 2లోని సాగర్ సొసైటీని ఆనుకుని ఉన్న ఇందిరానగర్, జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 51, 33, 44 తదితర ప్రాంతాల్లో కూడా డంపింగ్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి.అక్రమ డంపింగ్‌లపై జీహెచ్ఎంసీ శానిటేషన్ విభాగం నిఘా పెట్టి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు.
క్రిమినల్ కేసులు పెట్టిస్తాం రజినీకాంత్‌రెడ్డి, డీఎంసీ,జీహెచ్ఎంసీ సర్కిల్ -18
భవన నిర్మాణ వ్యర్థాలను కచ్చితంగా డంపింగ్ యార్డ్‌కు తరలించాల్సిందే. రోడ్ల పక్కన వ్యర్థాలను డంప్ చేస్తున్న వాహనాలపై నిఘా పెట్టాం. రోడ్లపక్కన డంపింగ్‌లు చేస్తే ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు అపరిశుభ్రంగా కనిపిస్తుంటాయి. నిర్మాణ వ్యర్థాలను రోడ్లపక్కన డంప్ చేస్తున్న వాహనాల నిర్వాహకులపై క్రిమినల్ కేసులు పెట్టడంతో పాటు వాహనాలను సీజ్ చేస్తాం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

