గణపతి ఆలయంలో చోరీ

- రెండు హుండీలను పగులగొట్టి నగదు అపహరణ
- నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు
మారేడ్పల్లి, మే 14: సికింద్రాబాద్ గణపతి ఆలయంలో దొంగలు పడ్డారు.. రెండు హుండీలను పగులగొట్టి నగదును ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరోనా, లాక్డౌన్ కారణంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న సికింద్రాబాద్ గణపతి ఆలయంలోకి భక్తులను అనుమతించడం లేదు. ఆలయం ముందు ఇద్దరు సెక్యూరిటీగార్డులు కాపలాగా ఉన్నారు. శుక్రవారం ఉదయం సెక్యూరిటీగార్డులు రెండు హుండీల తాళాలు పగులగొట్టి ఉండడాన్ని గమనించి.. ఆలయ ఈఓ అంజనీదేవికి సమాచారం అందించారు. వెంటనే ఆమె ఆలయానికి చేరుకొని పరిశీలించి.. పోలీసులకు సమాచారం అందించారు.. పోలీసులు.. క్లూస్ టీంతో ఆలయానికి వచ్చి పరిశీలించారు. సుమారు 50 వేల నుంచి రూ.1 లక్ష వరకు నగదు పోయి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. ఆలయ ఈఓ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజీలను పరిశీలించారు.. అందులో గురువారం అర్ధరాత్రి 1 గంట సమయంలో గుర్తు తెలియని వ్యక్తి మసీదుకు అనుకొని ఉన్న ప్రహరీ గొడ ఎక్కి.. ఆలయం మొదటి అంతస్తులోకి వచ్చాడు. ఆలయంలో 15 హుండీలు ఉండగా వాటిని ఆలయం వెనుక వైపునకు తీసుకెళ్లి.. రెండు హుండీలను పగులగొట్టి.. అందులోని నగదును తీసుకుని శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో బయటకు వెళ్లిపోయినట్లు సీసీ ఫుటేజీల ద్వారా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Ganesh temple
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

