అవయవ మార్పిడికి గాంధీ సిద్ధం
పేద రోగులకు ఉచితంగా అవయవ మార్పిడి చేసేందుకు గాంధీ ఆసుపత్రి సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయానికి అవయవ మార్పిడి కేంద్రం జీవం పోయనుంది.
- ఫలితమిస్తున్నకేసీఆర్ సంకల్పం
- వైద్యశాలలో నోడల్ కేంద్రం
- 2022లోనే రూ.35 కోట్లతో పనులకు శ్రీకారం చుట్టిన కేసీఆర్ సర్కారు
- 95 శాతం పనులు పూర్తి.. త్వరలో అందుబాటులోకి..
- 2022లో రూ.35 కోట్లతో అవయవ మార్పిడి కేంద్రం పనులను ప్రారంభించిన అప్పటి మంత్రి హరీష్‌రావు
- బీఆర్ఎస్ హయాంలోనే 90 శాతం పనులు పూర్తి
- ఆపై పనులను నిలిపివేసిన కాంగ్రెస్ సర్కార్
- ప్రతిపక్షాలు, రోగుల ఒత్తిడికి దిగివచ్చిన రేవంత్ ప్రభుత్వం
- పనుల్లో పురోగతి.. త్వరలో ఆపరేషన్ థియేటర్ల ప్రారంభం!
సిటీబ్యూరో/బన్సీలాల్‌పేట, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): పేద రోగులకు ఉచితంగా అవయవ మార్పిడి చేసేందుకు గాంధీ ఆసుపత్రి సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయానికి అవయవ మార్పిడి కేంద్రం జీవం పోయనుంది. కార్పొరేట్ ఆసుపత్రుల తరహాలో నిర్మించిన ఆరు థియేటర్లు నిర్మాణపు పనులు 95శాతం పూర్తయి అతి త్వరలోనే ప్రారంభానికి సిద్ధ్దమవుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో పేదోడికి ఉచిత వైద్యం అందించాలనే లక్ష్యంతో గడిచిన పదేళ్లు కేసీఆర్ సర్కార్ సంకల్పించి, జీవం లేక శిథిలమవుతున్న సర్కార్ దవాఖానలను కార్పొరేట్ స్థాయిలో మార్చింది. వాటిలో ఉచితంగా నాణ్యమైన వైద్యసేవలందించేందుకు అనునిత్యం కృషి చేసింది. ఇందులో భాగంగానే గాంధీ అసుపత్రిలో నోడల్ అవయవదాన మార్పిడి కేంద్రాన్ని రూ.35 కోట్లతో నెలకొల్పేదుకు 2022లోనే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
పేదవాడికి ఉచిత వైద్యమే లక్ష్యంగా..
కాలేయం, మూత్రపిండాలు, గుండె, ఊపిరితిత్తుల వంటి అవయవ మార్పిడికోసం రూ.లక్షల్లో అప్పులు చేసి కార్పొరేట్ ఆసుపత్రుల్లో అవయవ మార్పిడిలు చేయించుకోవడం గమనించిన కేసీఆర్ అవసరమైన ప్రతి పేదోడికి ఉచితంగా అవయవమార్పిడి సేవలందించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే నాటి వైద్యారోగ్యశాఖ మంత్రి టీ.హరీష్‌రావు.. గాంధీ ఆసుపత్రిలోని 8వ అంతస్తులో అవయవమార్పిడి కేంద్రం ప్రారంభించేందుకు వెనువెంటనే రూ.35కోట్లు మంజూరు చేశారు.
అప్పటినుంచి పనులు చకచకా సాగుతుండగా, ప్రభుత్వం మారడంతో మధ్యలో కాస్త నిలిచిపోయాయి. రోగుల అవస్థలు గమనించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాల నుంచి ఒత్తిళ్లు రావడంతో ఆయా పనులను పూర్తిచేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతానికి 95శాతం పనులు పూర్తికాగా మరో పదిహేను రోజుల్లో గాంధీలోని అవయవ మార్పిడి కేంద్రం అందుబాటులోకి రానుంది.

Hyd
అధునాతన పద్ధతుల్లో ఆరు థియేటర్లు..
గాంధీలోని ఆధునిక అవయవ మార్పిడి కేంద్రంలో లివర్, మూత్రపిండాలు, కాలేయం, గుండె వంటి అవయవాల మార్పిడికోసం ఆరు మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒకేసారి మూడు వివిధ రకాల అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించవచ్చు. అధునాతన హంగులతో నిర్మించిన ఈ అవయవ మార్పిడి కేంద్రంలో సెమినార్ హాల్ నెలకొల్పారు. వైద్య విద్య అభ్యసించే పీజీ విద్యార్థులకు వైద్యవిద్యలో భాగంగా ఆపరేషన్ థియేటర్లో నిర్వహించే అవయవ మార్పిడి చికిత్సను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేలా ఏర్పాటు చేశారు. వీటిలోనే నేరుగా దాత నుంచి గ్రహీతకు అవయవాన్ని అమర్చనున్నారు.
ఐసీయూ ట్రాన్సప్లాంటేషన్ గదులు, అబ్జర్వేషన్ రూములు, అవయవ మార్పిడి చికిత్సలందించే కార్డియాలజీ, పల్మనాలజీ, నెఫ్రాలజీ, హెపటాలజీ మొదలైన ఆయా విభాగాల వైద్యులకు సైతం గదులను ఇందులోనే కేటాయించారు. అటోమెటిక్‌గా తెరుచుకునే తలుపులు, బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు లోపలికి రాకుండా నిలువరించేందుకు అవసరమైన పరికరాలను సైతం అమర్చారు.
సామాన్యుడికి చేరువగా..
అవయవ మార్పిడి చికిత్సకోసం సామాన్యుడు కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేరితే రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. కిడ్నీ మార్పిడికి రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు, కాలేయం మార్పిడి రూ.25 లక్షల నుంచి రూ.38 లక్షలవరకు, గుండె మార్పిడికి రూ. 20లక్షల నుంచి రూ.30లక్షల వరకు, ఊపిరితిత్తులమార్పిడికి రూ.20లక్షల నుంచి రూ.25 లక్షల వరకు డబ్బులు కట్టించుకొని సామాన్యులను ముప్పుతిప్పలు పెడుతున్నారు ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులు. అయితే గాంధీలో ఈ కేంద్రం అందుబాటులోకి రావడం వల్ల సామాన్యుడు ఉపశమనం పొందుతాడు. అలాగే కేంద్రం ఏర్పాటుతో కేసీఆర్ తరతరాలకు చిరస్థాయిలో నిలిచిపోతారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gentleman | 33 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి శంకర్ ‘జెంటిల్మెన్’.. డిసెంబర్ 11న 4కే వెర్షన్‌తో గ్రాండ్ రీ రిలీజ్!
KTR | కేంద్రం ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయం.. డీలిమిటేషన్‌పై కేటీఆర్..!
Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Siddugadi Love Story | యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌నూ కట్టిపడేస్తున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’.. ఘనంగా సక్సెస్ మీట్!
Thiruveer | ‘శ్రీమతి’ నా జీవితంలో ఒక ఎమోషన్.. ఆ టైటిల్ వినగానే నా గతం గుర్తొస్తుంది : తిరువీర్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

