పోలీసు ఉద్యోగాలకు ఉచిత శిక్షణ

- రాష్ట్ర వ్యాప్తంగా 13 కేంద్రాలు
- ఆగస్టు 19న అర్హత పరీక్ష
సిటీబ్యూరో, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): మీరు పోలీసు కావాలనుకుంటున్నారా.. శిక్షణ కోసం ఆందోళన వద్దు.. పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ మీకు తోడుగా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 13 కేంద్రాలను ఏర్పాటు చేసి, 900 మందికి శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. రాష్ట్రంలో 20 వేల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది. దీంతో నిరుద్యోగ యువతకు ఉచితంగా శిక్షణ అందించేందుకు పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈనెల 19న ఉచిత శిక్షణ అర్హత కోసం పరీక్షను నిర్వహిస్తున్నది. ఈ అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన 900 మందికి ఐదు నెలల పాటు పూర్తిగా ఉచితంగా శిక్షణ ఇస్తామని పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ ప్రతినిధి గద్దె భాస్కర్ తెలిపారు. ఎంపికైన 900 మందిలో 300 మందికి రెసిడెన్షియల్ కోచింగ్ ఉంటుందనీ, వారికి ఉచితంగా హాస్టల్ వసతి, భోజన సౌకర్యం ఉంటుందన్నారు. మరో 300 మందికి డే స్కాలర్ కింది శిక్షణ, మరో 300 మందికి ఆన్లైన్లో నిరంతరం శిక్షణ ఉంటుందని తెలిపారు. అర్హత పరీక్ష రాసిన వారిలో మెరిట్ ఆధారంగా 900 మంది ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అర్హత పరీక్ష కోసం https://www.facebook.com/paravasthucreativefoundation లింక్‌లో నమోదు చేసుకోవాలని, వివరాల కోసం 7013244247, 6309148246 లలో సంప్రదించాలని కోరారు. డిగ్రీ ఉత్తీర్ణత, డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా అర్హత పరీక్షకు అర్హులని పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- free police training
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

