పెట్టుబడి పెట్టండి.. రెట్టింపు లాభాలిస్తాం

సిటీబ్యూరో, మార్చి 16(నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్ల బారినపడి మోసపోతున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది.. ప్రతి రోజూ 40 మంది వరకు బాధితులు ఫిర్యాదులు చేస్తుండగా.. అందులో 10 మందికి సంబంధించిన కేసుల్లో ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయి.. మంగళవారం కూడా పలువురు బాధితులు హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.. ఈ మేరకు పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఘటనలు ఇలా..
- ఖైరతాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి.. ఆన్లైన్లో పెట్టుబడులకు సంబంధించిన అంశంపై పరిశీలించాడు. ఆ క్రమంలో ఆన్లైన్ ఇన్వెస్ట్మెం ట్ చేయండంటూ గుర్తు తెలియని వ్యక్తులు అతడికి ఫోన్ చేశారు. మీరు పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయంటూ నమ్మించగా.. అతడు రూ. 2 లక్షలు పెట్టుబడిగా పెట్టాడు. డబ్బు పెట్టుబడి పెట్టగానే నిందితులు సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడంతో, ఇదంతా మోసమని గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
- క్రెడిట్ కార్డు అప్‌గ్రేడ్ చేస్తామంటూ నమ్మించిన సైబర్ నేరగాళ్లు.. అమీర్‌పేటకు చెందిన ఓ వ్యక్తి నుంచి రూ. 1.04 లక్షలు కాజేశారు. మరో ఘటనలో రూ. 90 వేలు, ఇంకో ఘటనలో రూ. 60 వేలు బాధితుల వద్ద నుంచి కొట్టేశారు.
- అమెరికాలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ నమ్మించి.. గోల్కొండకు చెందిన ఓ యువకుడికి రూ. 1.6 లక్షలు మోసం చేశారు.
- బేగంబజార్‌కు చెందిన ఒక వృద్ధుడికి ఫేస్బుక్లో ఒక యువతి పరిచయం అయ్యింది. తాను విదేశాల్లో ఉంటున్నానంటూ నమ్మిస్తూ కొన్నాళ్లు వాట్సాప్‌లో మాట్లాడుకున్నారు. మీ కోసం మంచి బహుమతి పంపిస్తున్నానంటూ నమ్మించి, ఆ తరువాత ఎయిర్ పోర్టు నుంచి కస్టమ్స్ అధికారులం మాట్లాడుతున్నామంటూ నమ్మించి రూ. 1.36 లక్షలను సైబర్‌నేరగాళ్లు వసూలు చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- double money
- fraud
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

