ట్రేడింగ్‌లో పెట్టుబడుల పేరుతో భారీ మోసం

ట్రేడింగ్, మార్కెట్లో పెట్టుబడుల పేరుతో భారీగా డిపాజిట్లు సేకరించి మోసం చేసిన ఓ వ్యాపారిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. జాయింట్ సీపీ అవినాష్ మహంతి కథనం ప్రకారం.. తుర్లపాటి సతీశ్ అలియాస్ చంద్ర, తుర్లపాటి గాయిత్రి దంపతులు ట్రేడింగ్, మార్కెట్, ఫార్మాసూటికల్స్ అండ్ నేచరోసూటికల్స్ ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారాల కో సం యూనిటస్ లైఫ్ సెన్స్‌స్ పేరుతో ఒక సంస్థను కాచిగూడలో ప్రా రంభించారు. తాము నిర్వహించే వ్యాపార వ్యవహారాల్లో పెట్టుబడు లు పెడితే భారీ లాభాలొస్తాయంటూ ఐదు మంది నుంచి రూ.3.35 కోట్లు వసూలు చేసి మోసం చేశారు. అనంతరం హెచ్ఎంఏ(హైదరాబాద్ మిలియనీర్ అలయన్స్) నెట్ వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మరో సంస్థను ఏర్పాటు చేసి మరికొంత మందిని మోసం చేయడం తో ఇతడిపై బహుదుర్‌పురా ఠాణాలో కేసు నమోదైంది. ఈ మోసాలకు పాల్పడ్డ సతీశ్‌ను సోమవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజ రు పరిచారు. కాగా.. ఈ కేసులో మరో నిందితురాలైన సతీశ్ భార్య గాయిత్రిని ఫిబ్రవరిలోనే అరెస్ట్ చేశారు. ఈ కేసును ఇన్స్పెక్టర్ భాస్కర్‌రెడ్డి నేతృత్వంలోని బృందం దర్యాప్తు జరుపుతున్నది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- fraud
- Online Trading
- scam
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

