CV Anand | మహిళా సాధికారత కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూ.. మాటలకే పరిమితం కాకుండా 174 ఏండ్ల చరిత్రలో లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా మొదటిసారిగా మహిళా ఇన్స్పెక్టర్కు బాధ్యతలను అప్పగించామని.. ఇటీవల జరిగిన బదిలీలలో మరో నలుగురికి ఎస్‌హెచ్‌ఓలుగా బాధ్యతలు అప్పగించామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ట్వీట్లో పేర్కొన్నారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలందించాలంటూ వారికి ఆయన అభినందనలు తెలిపారు.
అన్ని రంగాల్లో మహిళలు రాణించాలని మహిళా సిబ్బందిని ప్రోత్సహిస్తూ.. నగర పోలీస్ కమిషనర్‌గా సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారి లాలాగూడ ఇన్స్పెక్టర్గా మధులతకు ఎస్హెచ్ఓ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం లాలాగూడ, బొల్లారం, లంగర్‌హౌస్, అఫ్జల్‌గంజ్ ఎస్‌హెచ్‌ఓలుగా మధులత, లక్ష్మీమాధవి, మాధవీలత, చిట్టి బుర్ర బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.