హైదరాబాద్: నగరంలోని హబ్సిగూడలో కారు బీభత్సం సృష్టించింది. ఆదివారం ఉదయం హబ్సిగూడ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. కారులో ఉన్న యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.