Hyderabad | జూబ్లీహిల్స్‌లో రూ. 2 లక్షల విలువైన ఈ-సిగరెట్లు సీజ్.. నలుగురు అరెస్ట్
Hyderabad | జూబ్లీహిల్స్‌లో నిషేధిత ఈ-సిగరెట్లు విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను గురువారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు వ్యక్తుల నుంచి రూ. 2 లక్షల విలువైన సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు.
Hyderabad | హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌లో నిషేధిత ఈ-సిగరెట్లు విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను గురువారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు వ్యక్తుల నుంచి రూ. 2 లక్షల విలువైన సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ-సిగరెట్లు విక్రయిస్తున్నారని పక్కా సమాచారం అందడంతో.. టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేసి ఆ నలుగురిని పట్టుకున్నారు. అరెస్టు అయిన వారిలో షేక్ అస్లాం, రహీల్ ఖాన్, రిషి అగర్వాల్, శ్రేయాష్ అగర్వాల్ ఉన్నారు. మరో అనుమానితుడు మహమ్మద్ షోయబ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
షేక్ అస్లాం గత కొన్నాళ్ల నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో పాన్ షాపు నిర్వహిస్తున్నాడు. అతను నిషేధిత ఈ-సిగరెట్లు, హుక్కా ఫ్లేవర్స్‌ను విద్యార్థులకు, యువతకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ-సిగరెట్లను సరఫరా చేసేందుకు, విక్రయించేందుకు అస్లాంకు మిగతా ముగ్గురు మద్దతు ఇచ్చినట్లు పోలీసులు తేల్చారు. పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి రూ.2 లక్షల విలువైన సిగరెట్లు, హుక్కా ఫ్లేవర్లను స్వాధీనం చేసుకున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

