వెంగళరావునగర్, సెప్టెంబర్ 26: జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్‌రెడ్డి పార్టీలో తనను వ్యతిరేకిస్తూ.. అజారుద్దీన్ వర్గానికి అండగా నిలుస్తున్న ఎన్ఎస్యూఐ వైస్ ప్రెసిడెంట్‌ను కొట్టి, తుపాకీతో బెదిరించాడు. బాధితుడు మధురానగర్, బోరబండ పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం.. కార్మికనగర్‌కు చెందిన ఎన్ఎస్యూఐ ఉపాధ్యక్షుడు వెంకటస్వామి సోమవారం రాత్రి 7.30 గంటల సమయంలో మందులు తీసుకునేందుకు కార్మికనగర్ కూడలి వద్ద ఉన్న మెడికల్ షాపు వద్ద కు వచ్చాడు. అదే సమయంలో అన్నదాన కార్యక్రమానికి కారులో వెళ్తున్న విష్ణువర్ధన్‌రెడ్డి.. రోడ్డుపై ఉన్న వెంకటస్వామిని చూసి, కారు ఆపి తన వద్దకు పిలిచాడు. అతడిపై దుర్బాషలాడుతూ.. అసభ్యపదజాలంతో దూషించిన విష్ణు చేయి చేసుకున్నాడు. తన వద్దనున్న తుపాకీతో బెదిరించడంతో భయాందోళనకు గురైన వెంకటస్వామి మధురానగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.