మూసీ కోసం..3 పర్యటనలు 20 రోజుల వ్యవధిలోనే..
మూసీ పరివాహక ప్రాంతం సుందరీకరణపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, హెచ్ఎండీఏ కమిషనర్ దానకిశోర్, హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ ఆమ్రపాలి, సీఎంవో అధికారులు దేశ, విదేశాల్లోని నదీ తీర ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులను స్యయంగా పరిశీలించి, అధ్యయనం చేశారు.
సిటీబ్యూరో, జనవరి 22 (నమస్తే తెలంగాణ) : మూసీ పరివాహక ప్రాంతం సుందరీకరణపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, హెచ్ఎండీఏ కమిషనర్ దానకిశోర్, హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ ఆమ్రపాలి, సీఎంవో అధికారులు దేశ, విదేశాల్లోని నదీ తీర ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులను స్యయంగా పరిశీలించి, అధ్యయనం చేశారు. జనవరి 2న మూసీ సుందరీకరణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే 3 నెలల్లోగా మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.
దీంతో సమావేశం జరిగిన రెండు రోజుల్లో హెచ్ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్, మూసీరివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎంఆర్డీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్ ఆమ్రపాలి అహ్మదాబాద్ పర్యటనకు వెళ్లింది. ఆ నగరంలో సబర్మతి నదీతీర ప్రాంతాన్ని అధ్యయనం చేశారు. ఆ తర్వాత ఈ నెల 13న ఎంఆర్డీసీఎల్ ఎండీ ఆమ్రపాలి లండన్ పర్యటనకు వెళ్లారు. అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనను ముగించుకొని తన బృందంతో పాటు లండన్ వెళ్లి అక్కడి థేమ్స్ నదీ తీరంలో చేపట్టిన అభివృద్ధిపై అధ్యయనం చేశారు. ఆ తర్వాత వెంటనే దుబాయ్ పర్యటనకు వెళ్లారు. ఇలా 20 రోజులలో మూడు కీలకమైన నదితీర ప్రాంతాల అభివృద్ధి ప్రాజెక్టులను సీఎంతో పాటు ఉన్నతాధికారుల బృందం అధ్యయనం చేసి వచ్చింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

