Food Delivery Apps | హైదరాబాద్లో భారీ వర్షం.. ఆర్డర్లను నిరాకరిస్తున్న ఫుడ్ డెలివరీ యాప్స్
Food Delivery Apps | హైదరాబాద్ నగరమంతా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇండ్లకే పరిమితమైన చాలా మంది.. ఆహారాన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటున్నారు. కానీ ఫుడ్ డెలివరీ యాప్స్ మాత్రం కస్టమర్ల ఆర్డర్లను నిరాకరిస్తున్నాయి.
Food Delivery Apps | హైదరాబాద్ : హైదరాబాద్ నగరమంతా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇండ్లకే పరిమితమైన చాలా మంది.. ఆహారాన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటున్నారు. కానీ ఫుడ్ డెలివరీ యాప్స్ మాత్రం కస్టమర్ల ఆర్డర్లను నిరాకరిస్తున్నాయి.
ఎందుకంటే.. భారీ వర్షాల నేపథ్యంలో ఫుడ్ డెలివరీ బాయ్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు కాలనీలు జలమయం కావడం, రోడ్లపై వరద నీరు నిలిపోవడంతో పాటు పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో.. డెలివరీ బాయ్స్ అవస్థలు పడుతున్నారు. మొత్తానికి ఫుడ్ డెలివరీ బాయ్స్ అందుబాటులో లేకపోవడంతో.. కస్టమర్ల ఆర్డర్లను నిరాకరిస్తున్నాయి ఫుడ్ డెలివరీ యాప్స్. ఒక వేళ బుక్ అయినప్పటికీ.. వాటిని డెలివరీ చేసేందుకు చాలా సమయం పడుతోంది.
ఈ సందర్భంగా స్విగ్గీ డెలివరీ బాయ్ సమీర్ కృష్ణ మాట్లాడుతూ.. భారీ వర్షంలో ఫుడ్ డెలివరీ చేయడం కష్టంగా మారిందన్నాడు. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో.. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయని పేర్కొన్నారు. నెట్వర్క్లో కూడా సమస్యలు ఏర్పడటంతో.. ఫుడ్ డెలివరీకి ఇబ్బందిగా మారిందని తెలిపాడు.
జొమాటో కూడా ఆర్డర్లను అంగీకరించడం లేదు. ప్రస్తుతం తాము ఫుడ్ ఆర్డర్లను అంగీకరించడం లేదు.. త్వరలోనే తిరిగి వస్తామంటూ జొమాటో తమ కస్టమర్లకు సందేశాన్ని పంపుతోంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

