బేగంపేట్, అక్టోబర్ 19 : నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్తాధ్వర్యంలో దసరా బొనాంజా ఉత్సాహంగా నిర్వహించారు. గురువారం బేగంపేట్ వరుణ్ మోటార్స్‌లో దసరా షాపింగ్ బొనాంజా 10వ లక్కీ డ్రాలో ఐదుగురు విజేతలుగా నిలిచారు. షాపింగ్ మాల్స్‌లో కొనుగోలు చేసిన వినియోగదారులకు అందించిన కూపన్లతో ప్రతి రోజు ఒక్కో షోరూంలో లక్కీ డ్రా నిర్వహిస్తారు. చివరిDussehra దైన పదో లక్కీ డ్రాను గురువారం బేగంపేట్ వరుణ్ మోటార్స్‌లో వరుణ్ మోటార్స్ గ్రూప్ సీజీఎం వెంకటేశ్వర్రావు, సన్నీ అడ్వైర్టెజ్‌మెంట్ ఏజెన్సీ అధినేత ప్రతాప్‌రెడ్డి, బేగంపేట్ వరుణ్ మోటార్స్ జనరల్ మేనేజర్ కృష్ణ కుమార్, నమస్తే తెలంగాణ అడ్వైర్టెజ్‌మెంట్ జీఎం సురేందర్‌రావు, ఏజీఎం రమేశ్ పాల్గొని ఐదుగురు విజేతలను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వరుణ్ మోటార్స్ మేనేజర్ శ్రీకాంత్, జీఎం అడ్మిన్ సుజని, పద్మజ సుజికి జనరల్ మేనేజర్ ప్రవీణ్ పాల్గొన్నారు.
శ్రీ వేదిక్ ఎలక్ట్రానిక్స్‌లో కొనుగోలు చేసిన జోషి (కూపన్ నెం 21542) మొదటి బహుమతిగా (32 ఇంచుల ఎల్ఈడీ టీవీ) గెలుచుకున్నారు. ఏబీఆర్ కేఫ్ వినియోగదారురాలు ప్రవళిక (కూపన్ నెంబర్ 88436) రెండవ బహుమతిగా మొబైల్ ఫోన్ గెలుచుకున్నారు. శ్రీవేదిక్ ఎలక్ట్రానిక్స్ వినియోగదారుడు సాయికుమార్ (కూపన్ నెంబర్ 37761) మైక్రో ఒవెన్ మూడవ బహుమతిగా గెలుచుకున్నారు. నాలుగో బహుమతిని కూపన్ (నెంబర్ 37575) శ్రీవేదిక్ ఎలక్ట్రానిక్స్ కస్టమర్ నవీన్ గిఫ్ట్ ఓచర్‌ను గెలుచుకున్నారు. ఐదో బహుమతిని కూపన్ నెంబర్ (92309) ఏబీఆర్ కేఫ్ కస్టమర్ రోహన్ గిఫ్ట్ ఓచర్‌ను గెలుచుకున్నారు.
వినియోగదారులను ప్రోత్సహించడానికి లక్కీ డ్రాలు ఎంతో ఉపయోగపడతాయి. ప్రతియేటా నవరాత్రి ఉత్సవాల్లో నిజాయితీగా ఈ డ్రాలు తీసి విజేతలకు బహుమతులను అందిస్తున్న నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే వారికి కృతజ్ఞతలు. మా వరుణ్ మోటార్స్‌తో కలిసి 11 సంవత్సరాలుగా కలిసి డ్రా తీస్తున్నారు. దీంతో మా వరుణ్ మోటార్స్ కస్టమర్స్ కూడా ఎంతో సంతోషిస్తున్నారు. మా షోరూంలో పండుగ ఆఫర్లను ప్రకటించి వినియోగదారులకు నమ్మకంగా కార్లను అందజేస్తున్నాం.
– కృష్ణకుమార్, జనరల్ మేనేజర్, బేగంపేట్ వరుణ్ మోటార్స్
దసరా పండగ వచ్చిందంటే చాలు వినియోగదారులకు ఇలాంటి లక్కీ డ్రాలతో మరిన్ని లాభాలు వస్తాయి. నగరవ్యాప్తంగా ఇలాంటి లక్కీ డ్రా వల్ల వివిధ షాపింగ్ మాల్స్‌లో కొనుగోళ్లు చేసేందుకు ప్రజలు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇటువంటి మంచి స్కీమ్‌ను నడిపిన నమస్తే తెలంగాణకు ధన్యవాదాలు.
– ప్రతాప్‌రెడ్డి, సన్నీ అడ్వైర్టెజ్‌మెంట్ ఏజన్సీ అధినేత
బేగంపేట్ వరుణ్ మోటార్స్‌లో కొత్త కార్లతో పాటు ట్రూ వాల్యు కార్లను కూడా వినియోగదారులకు ఎంతో నమ్మకంగా అందిస్తున్నాం. ప్రతియేటా ట్రూ వాల్యు కార్ల అమ్మకాలు 15 శాతం పెరుగుతున్నాయి. వరుణ్ మోటార్స్‌కు సహకరిస్తూ వినియోగాదారులకు మరింత ఉత్సాహాన్ని అందించేందుకు కృషి చేస్తున్న నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే వారికి అభినందనలు.
– వెంకటేశ్వర్రావు, సీజీఎం, వరుణ్ మోటార్స్ గ్రూప్