Hyderabad | హాట్‌స్పాట్‌గా మారిన కోకాపేట నియోపొలిస్ లేఅవుట్.. దాని క్రేజ్ వెనుక రీజన్ ఇదీ..
Hyderabad |ఓ వైపు గండిపేట ’( Gandipet ) చెరువు, మరో వైపు ఔటర్ రింగు రోడ్డు ( Outer Ring road ).. అక్కడి నుంచి చూస్తే అద్భుతంగా కనిపించే ఫైనాన్సియల్ డిస్ట్రిక్ ( Financial District ). కనుచూపు మేరలో ఆకాశహర్మ్యాలు.. చుట్టూ గేటెడ్ కమ్యూనిటీలు.. మధ్యలో కోకాపేట చెరువు ( Kokapeta Lake ).. ఇలా ఎన్నెన్నో ఆకర్షణలు కోకాపేట నియోపొలిస్ చుట్టూ కనువిందు చేస్తున్నాయి.
Hyderabad |ఓ వైపు గండిపేట ’( Gandipet ) చెరువు, మరో వైపు ఔటర్ రింగు రోడ్డు ( Outer Ring road ).. అక్కడి నుంచి చూస్తే అద్భుతంగా కనిపించే ఫైనాన్సియల్ డిస్ట్రిక్ ( Financial District ). కనుచూపు మేరలో ఆకాశహర్మ్యాలు.. చుట్టూ గేటెడ్ కమ్యూనిటీలు.. మధ్యలో కోకాపేట చెరువు ( Kokapeta Lake ).. ఇలా ఎన్నెన్నో ఆకర్షణలు కోకాపేట నియోపొలిస్ చుట్టూ కనువిందు చేస్తున్నాయి. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న కోకాపేట నియోపొలిస్ లేఅవుట్ ( Neopolis Layout ) ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సరికొత్త హాట్‌స్పాట్‌గా మారింది. అంతర్జాతీయ ప్రమాణాలతో, దేశంలోనే మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ లేఅవుట్‌గా ఒకేసారి 530 ఎకరాల్లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ( HMDA ) అభివృద్ధి చేసింది.
సిటీబ్యూరో, జూలై 11 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మహానగరంలో సరికొత్త హాట్‌స్పాట్‌గా మారింది కోకాపేట నియోపొలిస్. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో 530 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో, దేశంలోనే మొట్ట మొదటి గ్రీన్ ఫీల్డ్ లేఅవుట్‌గా రూపుదిద్దుకుంటున్నది. ఈ ప్రాజెక్టుకు ఓ పక్క గండిపేట చెరువు, మరో పక్క ఔటర్ రింగు రోడ్డు.. అక్కడి నుంచి చూస్తే అద్భుతంగా కనిపించే ఐటీ కారిడార్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో దక్షిణ భారత దేశంలోనే అత్యంత ఎత్తయిన ఆకాశ హర్మ్యాలు, వాటి మధ్య కోకాపేట చెరువు చూపరులకు కనువిందు చేస్తున్నాయి.
ఎత్తయిన ప్రదేశం నుంచి చూస్తే సరికొత్తగా అభివృద్ధి చెందుతున్న కోకాపేట, నార్సింగి, నానక్‌రాంగూడ, పుప్పాల్‌గూడ, మంచిరేవుల, గండిపేట, కొల్లూరు, వట్టినాగులపల్లి, తెల్లాపూర్, గచ్చిబౌలి ప్రాంతాలు కొత్త అనుభూతినిస్తున్నాయి. దీంతో నగర వాసులు సరదాగా కోకాపేట నియోపొలిస్ లేఅవుట్లో గడిపేందుకు ఆసక్తి చూపుతున్నారు. నగరానికి చెందిన సైకిల్ రైడర్స్ బృందం సైతం గత ఆదివారం లేఅవుట్లోని విశాలమైన రోడ్లపై పరుగులు పెట్టి తమ అనుభూతిని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లు నియోపొలిస్ లేఅవుట్ ఫొటోలను అందంగా చిత్రీకరిస్తూ, వాట్సాప్ స్టేటస్, సోషల్ మీడియాల్లో పోస్టు చేస్తున్నారు. హెచ్ఎండీఏ ఇంతకుముందెప్పుడూ అభివృద్ధి చేయని రీతిలో అత్యంత విశాలమైన రహదారులతో లేఅవుట్‌ను నిర్మించింది. ఇందులో ప్రధాన రహదారులన్నీ 45 మీటర్లు(150 ఫీట్లు), 36 మీటర్లు (120ఫీట్లు)గా నిర్మించడంతో పాటు కేబుల్స్ అన్ని అండర్‌గ్రౌండ్‌లోనే ఏర్పాటు చేశారు. దీంతో ఈ ప్రాంతానికి వచ్చిన వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణే లక్ష్యంగా..
ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణే లక్ష్యంగా పనిచేస్తున్న హెచ్ఎండీఏ కోకాపేట నియోపొలిస్ లేఅవుట్లో అత్యంత విశాలమైన రోడ్లను అభివృద్ధి చేసింది. విశాలమైన రోడ్లకు అనుగుణంగా లేఅవుట్లో భారీ ఆకాశ హర్మ్యాలు సైతం పురోగతిలో ఉన్నాయి. నగరానికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు 30 నుంచి 50 అంతస్థుల ఎత్తుతో భవనాల నిర్మాణ పనులు చేపట్టాయి. ఒకవైపు లేఅవుట్ అభివృద్ధి పనులు జరుగుతున్న సమయంలోనే మొదటి దశ వేలం పాటలో ప్లాట్లను కొనుగోలు చేసిన కంపెనీలు నిర్మాణాలు మొదలు పెట్టాయి. తాజాగా రెండో దశలో ప్లాట్ల వేలానికి హెచ్ఎండీఏ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఈ లేఅవుట్‌ను చూసేందుకు నిత్యం వందలాది మంది వచ్చి వెళ్తున్నారు.
ఒకవైపు ఔటర్ రింగు రోడ్డు, మరోవైపు మెహిదీపట్నం-శంకర్పల్లి ప్రధాన రహదారి ఉండగా, ఈ రెండు వైపుల నుంచి మొత్తం 7 ప్రధాన రహదారులు లేఅవుట్లోకి వచ్చేలా నిర్మాణం పూర్తి చేశారు. కొత్తగా మరో 100 ఫీట్ల రోడ్డును కోకాపేట గ్రామంలోకి వెళ్లేలా నిర్మించేందుకు ఇటీవల టెండర్లను సైతం పిలిచారు. ఇలా నియోపొలిస్ లేఅవుట్లో రోడ్లన్నీ అత్యంత విశాలంగా ఉండటమే కాకుండా అన్ని దిక్కుల నుంచి అనుసంధానమయ్యేలా రోడ్లను నిర్మిస్తున్నారు. ఇక లేఅవుట్ నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు ఓఆర్ఆర్పై ట్రంపెట్‌ను నిర్మిస్తుండగా, ఇది త్వరలోనే పూర్తి కానున్నది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

