ఫస్ట్ ఎయిడ్ కిట్టు కరోనా మందులూ పెట్టు

- మల్టీ విటమిన్, జ్వరం మాత్రలూ ఉండాల్సిందే
- థర్మామీటర్తోపాటు.. పల్స్ ఆక్సీమీటరూ అవసరమే
- ప్రాథమిక దశలోనే కొవిడ్‌ను గుర్తించాలి
- వైద్యుల పర్యవేక్షణలోనే మందులు వాడాలి
ఇల్లు.. ఆఫీసు.. కంపెనీలు.. వాహనం.. ఇలా ఎక్కడైనా సరే.. ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండటం అత్యవసరం. ప్రమాదం ఎవరికీ చెప్పి రాదు. అందువల్లే అన్ని చోట్లా ప్రథమ చికిత్స బాక్స్‌ను తప్పనిసరి చేశారు. కానీ.. కొవిడ్ మహమ్మారి విస్తరిస్తున్న ఈ తరుణంలో ప్రతి ఇంట్లోనూ కరోనా మెడికల్ కిట్ కూడా ఉండాల్సిందేని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే.. ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు చేసే చిన్న తప్పుకు ఇంకెవరో మహమ్మారి బారిన పడే అవకాశమూ లేకపోలేదు. ఈ పరిస్థితుల్లో ముందుజాగ్రత్తే మనకు శ్రీరామరక్ష. అత్యవసరానికి ఇంట్లో ఉండే ఫస్ట్ ఎయిడ్ కిట్‌లో ఇప్పుడు.. కరోనా మందులనూ చేర్చాల్సిందే. ఏమాత్రం లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించి మాత్రలను వేసుకోవాలి.
సిటీబ్యూరో, మే 21 (నమస్తే తెలంగాణ): ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారిని గెలవాలంటే అప్రమత్తతే ఆయుధం. ముందుచూపే కాదు.. నివారించే మందులపై దృష్టి కూడా ఇప్పుడు ఎంతో అవసరం. ఇంట్లో ఒకరికి పాజిటివ్ వచ్చిందంటే మిగతా వారికీ సోకే పరిస్థితులున్న ఈ తరుణంలో ముందు జాగ్రత్తలు అత్యంత కీలకమని వైద్యులు సూచిస్తున్నారు. కొవిడ్‌ను కట్టడి చేయాలంటే ప్రతి ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ తరహాలో కరోనా మెడికల్ కిట్ కూడా ఉండాల్సిందేనని వైద్యులు పేర్కొంటున్నారు. అందులో కరోనా నియంత్రణకు అవసరమైన అన్ని రకాల మందులను కచ్చితంగా అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.
ఈ జాగ్రత్తలు అవసరం..
- కరోనా రాకముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒక వేళ కరోనా లక్షణాలు వస్తే ఎలాంటి వ్యవహరించాలి ? ఏయే పరీక్షలు చేయించుకోవాలన్న దానిపై కుటుంబంలో అందరికీ స్పష్టమైన అవగాహన ఉండాలి.
- మెడికల్ కిట్లను ఇంట్లో పెట్టుకొని ఎలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే ప్రాథమికంగా మందులు వేసుకోవడం ముఖ్యం.
- ఇంట్లో ఒకరికి పాజిటివ్ వచ్చి, మిగతా వారికి రాకున్నా వైద్యుల సూచన మేరకు ఇమ్యూనిటీ పవర్ పెంచే మాత్రలు వాడటం మంచిది.
- మాస్కు ధరించడం, శానిటైజేషన్ అనేవి ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా అస్సలు మర్చిపోవద్దు.
కరోనా కిట్‌లో ఉండాల్సిన మందులు….
- డోలో 650 ఎంజీ gఅజిత్రోమైసిన్ 500 ఎంజీ
- మోన్టెక్ ఎల్సీ
- మౌత్ వాష్ మరియు గార్లిక్ కోసం బీటాడీన్
- విటమిన్ సీ మరియు డీ3
- బి క్లాంప్లెక్స్ పోర్ట్
- జింకోవిట్ ట్యాబ్లెట్స్
- ఆవిరి యంత్రం
- పల్స్ ఆక్సీమీటర్ g థర్మా మీటర్
- ఆక్సిజన్ సిలిండర్ (కరోనా సోకి అత్యవసర పరిస్థితిలో ఉన్న వారికి మాత్రమే)
- శ్వాస వ్యాయామ పరికరాలు
- ఆరోగ్య సేతు మొబైల్ యాప్
అప్రమత్తంగా ఉంటే ప్రాథమిక దశలోనే గుర్తింపు…
కరోనా వైరస్ వ్యాప్తి, దాని లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. సాధారణ జర్వం, జలుబు, గొంతునొప్పి అని నిర్లక్ష్యం చేయకూడదు. కరోనా అని అనుమానించి చికిత్స తీసుకోవాలి. ముఖ్యంగా కరోనాను తట్టుకోవాలంటే మనిషి శరీరంలో రోగ నిరోధకశక్తి బాగా ఉండాలి. ఇది అందరిలో ఒకేలా ఉండదు. కాబట్టి శరీరంలో రోగ నిరోధకశక్తి పెంచుకునేందుకు మల్టీవిటమిన్ ట్యాబెట్లు ముందుగా వాడడం మంచిదే. బీ కాంప్లెక్సు విటమిన్‌తో పాటు జింక్ ట్లాబెట్లు వాడవచ్చు. కరోనా సోకి స్వల్ప లక్షణాలు కనిపిస్తుంటే వెంటనే జ్వరం తీవ్రతను థర్మామీటర్ ద్వారా తెలుసుకోవడంతో పాటు పల్స్ ఆక్సీమీటర్‌తో ఆక్సిజన్ లెవల్స్‌ను ఎప్పటికప్పుడు చూసుకోవాలి. ఆక్సిజన్ సాచురేషన్ 95 కంటే ఎక్కువ ఉంటే ఎలాంటి సమస్య ఉండదని గుర్తుంచుకోవాలి. అంతకన్నా తక్కువగా ఉంటే మాత్రం వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవడం మంచిది. డాక్టర్ పాయల్ భార్గవ్
వైద్య నిపుణుల పర్యవేక్షణలోనే..
అయితే ఇంట్లో ఉన్నప్పుడు కరోనా కట్టడి కోసం ఏమాత్ర పడితే అది వేసుకోవడం మంచిది కాదు. కేవలం వైద్య నిపుణులు సూచనల మేరకే ఇంట్లో అవసరమైన ట్యాబెట్లను అందుబాటులో ఉంచుకోవాలి. ఆన్లైన్, యూట్యూబ్, సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల్లోని సమాచారం చూసి సొంత వైద్యం చేసుకోవడం వల్ల ఉన్న సమస్య తీరకపోగా.. కొత్త సమస్యలూ వచ్చిపడే అవకాశమూ ఉంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- first aid kit
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

