హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు ఎదురుగా ఉన్న గగన్‌విహార్ కారు పార్కింగ్‌లో శనివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో నాలుగు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసింది. వీకెండ్ కావడంతో నుమాయిష్‌కు భారీ సంఖ్యలో జనాలు తరలివచ్చారు. ఈ క్రమంలో నాంపల్లి పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.