హైదరాబాద్: హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో (Rajendranagar) భారీ అగ్నిప్రమాదం (Fire accident) జరిగింది. డెయిరీఫామ్ (Dairy farm) చౌరస్తా సమీపంలో ఉన్న ఓ అపార్ట్మెంట్ సెల్లార్లో (Apartment cellar) మంటలు చెలరేగాయి. క్రమంగా ఒక్కోవాహనానికి అంటుకోవడంతో సెల్లార్లో ఉన్న కార్లు, బైకులు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అందుపుచేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్య్కూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.