Nampally Criminal Court | హైదరాబాద్‌లోని నాంపల్లి క్రిమినల్ కోర్టులో అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున కోర్టు భవనం మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
హుటాహుటిన అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించి, ఇతర అంతస్తులకు మంటలు వ్యాపించకుండా అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. కాగా, షార్ట్‌సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం సంభవించి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని అధికారులు వెల్లడించారు.
ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఆస్తి నష్టం ఎంతమేరకు జరిగిందనే అంశాలపై అధికారులు విచారణ చేపట్టనున్నారు.
నాంపల్లి క్రిమినల్ కోర్టులో అగ్నిప్రమాదం
మధ్యరాత్రి అకస్మాత్తుగా చెలరేగిన మంటలు
షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని అధికారుల అనుమానం
ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం
సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక… pic.twitter.com/XJbhYD2McL
— Telugu Scribe (@TeluguScribe) July 6, 2026