Mirchowk | మీర్చౌక్లో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది మృతి
మీర్చౌక్లో (Mirchowk) భారీ అగ్నిప్రమాదం జరిగింది. చార్మినార్ సమీపంలోని గుల్జార్‌హౌస్‌లో (Gulzar house) మంటలు చెలరేగాయి. ఆదివారం ఉదయం 6.30 గంటల సమయంలో భవనంలోని మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. సెల్లార్తోపాటు ఫస్ట్‌ఫ్లోర్‌లో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి.
హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీలోని మీర్చౌక్లో (Mirchowk) భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున చార్మినార్ సమీపంలో ఉన్న గుల్జార్‌హౌస్‌లో మంటలు చెలరేగాయి. భవనం మొదటి అంతస్తులో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఈఘటనలో పది మంది మరణించగా. మరో 15 మంది అపస్మారక స్థితిలో ఉన్నట్లు అగ్నిమాపక అధికారులు వెల్లడించారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. ఎనిమిది ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపుచేశారు. భవనంలో ఉన్నవారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనా స్థలంలోనే ముగ్గురు మృతిచెందగా, మరో ఐదుగురు దవాఖానలో చికిత్స పొందుతూ మరణించారని పోలీసులు తెలిపారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు, ఇద్దరు చిన్నారులు ఉన్నారని చెప్పారు. మరణించినవారిని అభిషేక్ మోడీ (30), ఆరుషి జైన్ (17), హర్షలి గుప్తా (7), షీతల్ జైన్ (37), రాజేందర్ కుమార్ (67), సుమిత్ర (65), మున్ని బాయి (72), ఇరాజ్ (2)గా గుర్తించారు. గాయపడిన వారిని ఉస్మానియా, మల్కపేట (యశోద), డీఆర్డీవో, హిమాయత్‌నగర్ అపోలో దవాఖానలకు తరలించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాదం ధాటికి పలువురు స్పృహ కోల్పోయారు. దట్టంగా పొగ కమ్ముకోవడంతో స్థానికులు ఊపిరాడక ఇబ్బందిపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

