హైదరాబాద్: నగరంలోని బాచుపల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బాచుపల్లిలో ఉన్న ఓ కెమికల్ గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి గోదామ్ మొత్తం విస్తరించడంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. మంటల ధాటికి రసాయన డబ్బాలు పేలిపోతున్నాయి. దీంతో గోదామ్ పరిసర ప్రాంతాల్లో పొగలు దట్టంగా అలముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేస్తున్నారు. కాగా, అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు.