హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం బండ్లగూడలోని(Bandlaguda ) రత్నదీప్ సూపర్ మార్కెట్లో (Supermarket) భారీ అగ్ని ప్రమాదం(Fire accident) చోటు చేసుకుంది. సూపర్ మార్కెట్లో మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ కమ్ముకోవడంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రత్నదీప్ సూపర్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం
రాజేంద్రనగర్ – బండ్లగూడలోని రత్నదీప్ సెలెక్ట్ సూపర్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
ఘటనకు మరమ్మతు పనుల్లో షార్ట్‌సర్క్యూటే కారణమని అనుమానిస్తున్నారు.. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. pic.twitter.com/yHMSKpCC2O
— Telugu Scribe (@TeluguScribe) April 7, 2024