Hyderabad | హైదరాబాద్ : పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాఘవేంద్ర కాలనీ సమీపంలోని ఫ్రూట్ స్టాల్, మటన్ దుకాణం, స్క్రాప్ దుకాణాల్లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
ఘటానాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో నాలుగు దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి. అగ్నిప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. భారీగా ఆస్తి నష్టం సంభవించిందని దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేశారు.